డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యువ హీరో.. 

Durga Writes

హైదరాబాద్ లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఒక్క హైదేరాబద్ లోనే కాదు చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే హైదేరాబద్ లో మరి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఫ్లై ఓవర్ పైనుంచి కారు ఓవర్ స్పీడ్ తో సినిమాలో యాక్షన్ సన్నివేశంలా కారు కిందపడింది.. 

                             

నిన్నటికి నిన్న ఓ ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ ఓ సాఫ్ట్ వెర్ ఇంజీనీర్ ని తలపై బస్సు పోనిచ్చి పొట్టన పెట్టుకున్నాడు. దీంతో రోజురోజుకు యాక్సిడెంట్లు ఎక్కువ జరగటంతో అలెర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు వీటిని నివారించేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నారు.

                           

ఇందులోభాగంగా, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడిక్కడ డ్రంకెన్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మందుబాబులను పట్టుకుంటున్నారు. అయినప్పటికీ మందుబాబుల్లో పెద్దగా మార్పు రావడంలేదు.

                                      

తాజాగా సినీ హీరో, బిగ్ బాస్ కంటస్టెంట్ 'ప్రిన్స్' డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికాడు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ కాలేజీ వద్ద డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికాడు. అయితే, ఈ ఘటన ఈ నెల 24వ తేదీ ఆదివారం జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రంకెన్ డ్రైవ్ కేసు నేపథ్యంలో మంగళవారం కూకట్‌పల్లి 4వ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టుకు హీరో ప్రిన్స్ హాజరయ్యాడు. దీంతో అతనికి కోర్టు రూ.5 వేలు ఫైన్ విధించింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: