జబర్దస్త్ లో నా ప్రయాణం ముగిసింది : నాగబాబు
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంత పాపులారిటీ ఉందొ విషయం తెలిసిన విషయమే. అయితే ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రారంభం అయినప్పటి నుంచి జబర్దస్త్ జడ్జి గా బ్రదర్ నాగబాబు కొనసాగుతున్నారు. అయితే జబర్దస్త్ జడ్జ్ మెగా బ్రదర్ నాగబాబు ఆయన నవ్వులతోనే ప్రేక్షకులకు కామెడీ పంచగలరు. జబర్దస్త్ షో తో నాగబాబు కాస్త నవ్వులు నాగబాబు గా మారిపోయారు. జబర్దస్త్ అంటే నాగబాబు నాగబాబు అంటే జబర్దస్త్ అన్న రేంజ్ లో ప్రభావితం చేస్తారు మెగాబ్రదర్ నాగబాబు.. జబర్దస్త్ ప్రేక్షకుడు నాగబాబు లేకుండా జబర్దస్త్ షో ని ఊహించుకోలేనంతగా ప్రభావితం చేశారు నాగబాబు. ఇక జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుండి నేటి వరకు జబర్దస్త్ షోలో జడ్జ్ గా కొనసాగుతూనే ఉన్నారు. దీంతో నాగబాబు జడ్జీ గా లేని ఎపిసోడ్ ఉంటే అందులో పెద్ద లోటే కనిపిస్తూ ఉంటుంది.
ఒక జడ్జ్ గానే కాకుండా జబర్దస్త్ కమెడియన్స్ అందరిని ఎంకరేజ్ చేస్తూ మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కమెడియన్స్ అందరికీ ఒక అన్న ఎలా మారిపోయారు. జబర్దస్త్ కమెడియన్స్ కి జబర్దస్త్ జడ్జ్ నాగబాబుకి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అయితే జబర్దస్త్ షో ఎంత ఫేమస్సో.. జబర్దస్త్ షో లో జడ్జీగా ఉన్న నాగబాబు నవ్వులు కూడా అంతే ఫేమస్. నాగబాబు నవ్వులు కూడా జబర్దస్త్ ఫేమస్ అవ్వడానికి కారణం అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ జడ్జిగా తప్పుకుంటున్నారు అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ డైరెక్టర్ అయిన నితిన్ భరత్ లను తీసివేయడం వల్ల జబర్దస్త్ జడ్జిగా ఉన్న నాగబాబు కాస్త హర్ట్ అయినట్లు తెలుస్తుంది. అందువల్ల జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా జబర్దస్త్ షో లో నాగబాబుకు సరిగా రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం వల్లే జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు క్రియేట్ చేసిన నా ఛానల్ నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ లో జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇస్తూ వీడియో చేశారు మెగా బ్రదర్ నాగబాబు. శుక్రవారం ఎపిసోడ్ తో జబర్దస్త్ లో తన జర్నీ ముగిసిపోతుంది అంటూ తెలిపారు. తనపై అనవసర పుకార్లు వస్తున్నాయి కాబట్టి దీనిపై క్లారిటీ ఇస్తున్నాను అంటూ మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో తాను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నాను అని వార్తలు వస్తున్నాయని అవన్నీ నిజం కావని రెమ్యూనరేషన్ లో తనకు పట్టింపులు ఏమీ లేవంటూ నాగబాబు చెప్పారు. జబర్దస్త్ లో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు వల్లే తాను జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే జబర్దస్త్ షో తో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని... జబర్దస్త్ షో నుంచి తనకు తానుగా మానేస్తానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో జబర్దస్త్ ప్రేక్షకులు కాస్త ఫీల్ అవుతున్నారు కూడా.