ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలేషన్స్ చాలా డిఫరెంట్ గా వుంటాయి. షర్ట్ మార్చినంత ఈజీగా లవర్స్ ని మార్చేస్తుంటారు స్టార్స్. ఈ విషయంలో మన తమిళ కాసనోవ శింబుకి, క్యూట్ గర్ల్ హన్సిక చాలా అనుభవం వుంది. శింబు మొదట్లో నాటీ గర్ల్ నయనతార ప్రేమలో ముగినితేలి చివరికీ పెళ్లిదాకా వెళ్లి బ్రేక్ అప్ చెప్పాడు.
సేమ్ వే పాలబుగ్గల సుందరి హన్సిక కూడా కెరీర్ మొదట్లో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో...........పీకల్లోతు ప్రేమలో తేలాడింది . ఈ ఇద్దరు కూడా పెళ్ళి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత హన్సిక ....బైబై చెప్పేసింది. ఇక ఆ తరువాత ఏకాకిగా మారిన శింబు, హన్సిక జత కట్టారు. సినిమాలోనేకాదు రీయల్ లైఫ్ లో లవ్ స్టోరి రన్ చేశారు. నేను శింబుతో ప్రేమలో పడ్డానోచ్ అని హన్సిక ట్వీట్ చేయగానే, యస్ ..ఐయాన్ ఇన్ లవ్ అంటూ శింబు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ప్రేమను ప్రపంచానికి తెలియజేశాడు.
ఇక తరువాత ఏముంది.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకోని తిరిగారు. కట్ చేస్తే ఈ ఇద్దరి లవ్ కూడా బ్రేక్ అప్ అయింది. రీజన్ ఏంటో అంటారా..?కలవడానికి రీజన్స్ వుండాలికానీ...విడిపోవడానికి ఎందుకండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో కారణం లేకుండానే ఇద్దరూ విడిపోయారు. అయితే శింబుతో అనుభవం భళా అంటోంది హన్సిక . అతడితో గడిపినన్ని రోజులు చాలా హ్యాపిగా వున్నాను.అతడిపై గౌరవం వుంది. అందుకే ఎందుకో విడిపోయానో చెప్పలేను అంటోంది. అయితే కొద్దిమంది హన్సిక విడిపోవడానికి కారణం నాటీగర్ల్ నయనతార అంటున్నారు. ఎందుకంటే నయన్, శింబు కలిసి ఇప్పుడు ఓ సినిమాలో నటించబోతున్నారు. శింబుపై ఎంతో కోపం వున్నా నయన్ కలిసి నటించడానికి ఒప్పుకుంది అంటే మళ్లీ ప్రేమాయణం సాగించరని గ్యారంటీ ఏముంది అనే ధాట్ తోనే హాన్సిక తన లవ్ కు బ్రేక్ అప్ చెప్పిందని కోలీవుడ్ టాక్.
మరింత సమాచారం తెలుసుకోండి: