ఓటు వేయకపోతే జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది అని చెప్పాలి రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తికాగా మరికొన్ని రాష్ట్రాలలో నేడు పోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే అటు ఎన్నికల అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

 ఓటు యొక్క ఆవశ్యకత ఏంటి అన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేశారు. అయితే ఇంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కొంతమంది ఓటర్స్ మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉంటారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి లైన్లో నిల్చుని ఓటు వేయడం ఎందుకు హాయిగా ఇంట్లోనే కూర్చుంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఓటు వేయని వారిపై  శిక్షించేందుకు ఇండియాలో ఎలాంటి చట్టాలు లేవు అన్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత అని తెలిసిన కూడా కొంతమంది నిర్లక్ష్యంగానే ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇండియాలో ఇలా ఓటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పెద్దగా చట్టాలు ఏమీ లేవు  కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఓటు వేయకపోతే చివరికి ఎన్నో పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పాలి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా బ్రెజిల్ ఉరుగ్వే టర్కీ లాంటి దేశాలను ఎవరైనా ఓటు వేయలేదు అంటే ఇక అందుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణతో సంతృప్తి చెందకపోతే చివరికి జరిమానా తప్పదు. అయితే అటు బెల్జియం లో మాత్రం వరుసగా నాలుగు సార్లు ఓటు హక్కును వినియోగించుకోకపోతే చివరికి జైలుకు పంపిస్తారు. ఇంకోవైపు పెరులో ఓటు వేయని వారికి ఏకంగా రేషన్ కట్ చేయడం లాంటివి చేస్తారు. ఇలాంటివి ఇండియాలో కూడా చేస్తే బాగుంటుందని అప్పుడైనా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎంతోమంది నైటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: