గబ్బర్ సింగ్ తో తెలుగుఅమ్మాయి

Prasad
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధ పడుతుంది. కాగా ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. ఈ చిత్రానికి కథను ఇప్పటికే సిద్ధం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేయాడానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయి అంజలి మొదటగా తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. షాపింగ్ మాల్, జర్నీ, సతీ లీలావతి వంటి అనువాద చిత్రాలతో తెలుగులోనూ తన కంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తుంది. ఇప్పడు పవన్ కళ్యాణ్ సరసన అంజలి ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే తెలుగు అమ్మాయి అంజలికి మరో సూపర్ ఛాన్స్ తగిలినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: