మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇందులో కాగాల్సినంత ఎంటర్టైనర్ తో పాటు మహేష్ హీరోయిజం ను కూడా ఎలివేట్ చేయబోతున్నాడు. మహేష్ కామెడీ చేయగలడని ఖలేజా సినిమా నిరూపించింది. అయితే, మహేష్ బాబుకు ఇప్పుడు కావలసింది ఇలాంటి ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. పక్కా మాస్ సినిమా కావాలి.
మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా క్లాసికల్ గా ఉంటున్నాయి. ఎంటర్టైనర్ వేలోను అదే విధంగా, సామాజిక కోణంలోనూ ఉంటున్నాయి. ఇవి ఇప్పుడు అవసరమే. ఏ జానర్లో సినిమా చేసినా... ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అది ఇస్తున్నాడు. అది చాలు అనుకుంటే పొరపాటే. కానీ, మహేష్ బాబుకు ఇప్పుడు కావాల్సింది ఇది కాదు. యాక్షన్ కావాలి. పక్కా మాస్ సినిమా కావాలి.
మహేష్ బాబును ఇప్పటి వరకు పక్కా మాస్ గా చూపించిన వ్యక్తి ఎవరూ అంటే పూరీనే గుర్తుకు వస్తాడు. పోకిరి, బిజినెస్ మెన్ సినిమాల్లో మహేష్ బాబు చూపించిన విధానం సూపర్బ్. మరలా అలాంటి మాస్ హిట్ మహేష్ బాబుకు కావాలి. మహేష్ అలాంటి సినిమాలు చేయలేడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ముమ్మాటికీ రాంగ్ అని చెప్పాలి. మహేష్ పేస్ లో సీరియస్ యాంగిల్స్ చాలా ఉన్నాయి.
వాటిని అతడు సినిమా ద్వారా త్రివిక్రమ్, ఒక్కడు సినిమా ద్వారా గుణశేఖర్, పోకిరి సినిమా ద్వారా పూరి బయటకు తీశారు. మిగతా దర్శకులు సినిమాలు తీస్తున్నా మహేష్ బాబును ఆ యాంగిల్స్ లో చూపించలేకపోయారు అన్నది ఒక వాదన. మహేష్ బాబును కథ ప్రకారం ఖచ్చితంగా అలా చూపించాలి అంటే మహేష్ చేయడానికి రెడీగా ఉంటాడు. కావాల్సింది అలాంటి కథే. మరి మహేష్ కు పక్కా మాస్ కథను ఎవరు సిద్ధం చేస్తారో చూడాలి.