బాలయ్య సినిమా కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బోయపాటి..?
ఇదిలా ఉండగా డైరెక్టర్ బోయపాటి గతంలో బాలకృష్ణతో చేసిన రెండు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మొదలుపెట్టే మూడో సినిమాలో కూడా అదే పంథాలో కొనసాగించాలని..గతంలో బాలకృష్ణతో చేసిన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను తీసుకుని సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అదే సెంటిమెంట్ కొనసాగించాలని ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలని డైరెక్టర్ బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాలయ్యకు ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్‌ను దింపుతున్నట్టు తెలుస్తోంది.
రచితా రామ్ కన్నడలో బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆరేడు సినిమాలు చేస్తోంది. గ్లామర్ తారగా అక్కడి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఇప్పుడు ఆ గ్లామర్ హీరోయిన్ను ఇక్కడ బాలయ్య పక్కన పెట్టి బోయపాటి ఎంత వరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు బోయపాటి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రలో సంజయ్ దత్ నీ తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇవన్నీ నిజం కాదో..అవునో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.