సమంత నాని మరో క్రేజీ ప్రాజెక్ట్

shami

అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. పెళ్లికి ముందు వరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సమంత ఇప్పుడు ఫిమేల్ లీడ్ సినిమాలను చేస్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ మజిలీ,  ఓ బేబీ సినిమాల హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సమంత ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తుంది. 

 

ఈ సినిమాతో పాటుగా నాచురల్ స్టార్ నానితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. నానితో నిన్నుకోరి సినిమా తీసి హిట్ అందుకున్న శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. మజిలీ నిర్మాతలు షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్నుకోరి,  మజిలీ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న శివ నిర్వాణ తన థర్డ్ మూవీని క్రేజీ కాంబినేషన్ లో చేస్తున్నాడు. 

 

నాని, సమంత కలిసి ఇదివరకు ఎటోవెళ్లిపోయింది మనసు సినిమా చేశారు. ఈ కాంబోలో మరో సినిమా అది కూడా శివ నిర్వాణ లాంటి డైరెక్టర్ చేయడం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీ కథ కూడా లవ్ స్టొరీ అని తెలుస్తుంది.  నాని,  సమంత ఇద్దరు కలసి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

 

నాని, సమంత,  శివ ముగ్గురు కలిసి ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా  చేస్తాడని చెప్పొచ్చు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శివ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని తో సమంత చేస్తున్న ఈ మూవీ అందరిని మెప్పించాలని ఆశీద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: