బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. టాలీవుడ్ తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3... 14 వారాల పాటు కొనసాగింది. ఇక ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. తమ తమ అభిమాన సెలబ్రెటీలను బిగ్ బాస్ హౌస్ లో ఉండడంతో టీవీ ప్రేక్షకులందరూ బిగ్ బాస్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయారు. కాగా జూలై నెలలో ప్రారంభమైన బిగ్ బాస్ 3 తెలుగు రియాల్టీ షో ప్రస్తుతం రెండు రోజుల్లో ముగియనుంది. కాగా మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో ప్రస్తుతం... టాప్ 5కి చేరుకుంది. కాగా ప్రస్తుతం ఫైనల్ టాప్ 5 లో బాబా భాస్కర్ శ్రీముఖి వరుణ్ సందేశ్ అలీ రెజా రాహుల్ ఉన్నారు. గత వంద రోజులుగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ 3 షో విన్నర్ ఎవరో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
ఫైనల్ లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ విన్నర్ పై పలు ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఎక్కువగా బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో ఉన్న శ్రీముఖి రాహుల్ వరుణ్ సందేశ్ లలో ఒకరు బిగ్ బాస్ విన్నర్ టైటిల్ వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వెలుగుతున్నాయి. మరి నిజమైన టైటిల్ విన్నర్ ఎవరో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఫుల్ గా సందడి నెలకొంది. బిగ్ బాస్ మొదలైన మొదటి వారం నుంచి మొన్న చివరి వారం వరకు ఎలిమినేట్ అయిన సభ్యులందరూ బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ అంతా సందడి సందడి గా మారిపోయింది. ఐదుగురు తోనే హౌస్ బోసిపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ బిగ్ బాస్ సభ్యులందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తుండడంతో బిగ్ బాస్ ప్రేక్షకులందరూ ఫుల్ ఖుషీ అయిపోయారు.
కాగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తుండడంతో... బిగ్ బాస్ షో మొత్తం రంజు గా మారిపోయింది. ఇక ప్రేక్షకులు ఎలిమినేట్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్ లోకి రావడంతో ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ నేపథ్యంలో పునర్నవి శ్రీముఖి ఎత్తుకోగా... శ్రీముఖి దగ్గర నుంచి రాహుల్ పునర్నవిని ఎత్తుకున్నాడు. ఈ జంట మరోసారి బిగ్ బాస్ హౌస్లో ముచ్చటించింది.ఈ నేపథ్యంలో నేడు బిగ్ బాస్ హౌస్ లో ఏ సభ్యుడికి ఎలాంటి అవార్డ్ ఇవ్వాలనే దానిపై చిన్న కాంటెస్ట్ జరుగుతుంది. అందులో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన హేమకు పక్కా మాస్ అవార్డు ఇచ్చారు సభ్యులందరూ. ఇక ఆ తర్వాత ఫైర్ బ్రాండ్ అవార్డుని రవి పై సంచలన కామెంట్స్ చేసి ఎలిమినేట్ అయిన తమన్నాకి, రీసెంట్గా ఎలిమినేట్ అయిన పునర్నవి ఇచ్చారు. హౌస్ లోని సభ్యులందరూ రావడంతో ఫుల్ సందడి చేస్తున్నారు.