అంజలి క్రైం డిటెక్టివ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Suma Kallamadi
చూడచక్కని అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి ఈ సారి పవర్‌ఫుల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి, చిత్రంగద లాంటి సినిమాలతో అందరిని బాగా మెప్పించిన అంజలి. ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతుంది అంజలి.


ఈ సినిమా హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న  నుంచి మేకర్స్ తాజాగా అంజలి లుక్ రిలీజ్ చేయడం జరిగింది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న సైలెన్స్ సినిమాలో అంజ‌లి పవర్‌ఫుల్‌ క్రైం డిటెక్టివ్‌ ఏజెంట్‌ 'మహా'గా కనిపించనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలియచేసింది. లుక్ పరంగా అదరగొడుతున్న అంజలిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట బాగా వైరల్గా మారింది.


ఈ సినిమాలో కోన వెంకట్, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న  అనుష్క లీడ్ రోల్ పోషిస్తోంది. భాగమతి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆమె సరికొత్తగా మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తోంది. అలాగే మాధ‌వ‌న్, షాలినిపాండే, సుబ్బ‌రాజ్, అవసరాల శ్రీనివాస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు ప్రయత్నం చేస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనుష్క, మాధవన్‌ లుక్స్‌, ప్రీ టీజర్ విడుదల చేసిన చిత్రయూనిట్ మంచి స్పందన లభించిన సంగతి అందరికి తెలిసిందే. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్‌ రిలీజ్‌ చేస్తాము అని చిత్ర యూనిట్ తెలియచేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల అవుతుంది అని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: