మెగాస్టార్ తో శ్రీమంతుడా....??

Mari Sithara
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చారిత్రాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ తన కెరీర్ లో తొలిసారి స్వతంత్ర సమరయోధుడిగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటించగా తమన్నా మరియు అనుష్క శెట్టి ప్రత్యేక పాత్రల్లో నటించడం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా యారేజ్ టాక్ ని మూటగట్టుకుంది. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించగా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ ని, అలానే రత్నవేలు ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. 

ఇకపోతే దీని తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా పూజా కార్యక్రమలు ఇటీవల ఘనంగా జరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించనున్నాయి. ఈ సినిమాకోసం మెగాస్టార్ ఇప్పటికే చాలావరకు బరువు కూడా తగ్గారు. అయితే నేడు కొన్ని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ కొంతవరకు గతంలో మహేష్ మరియు కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడుని పోలి ఉంటుందని టాక్ వినపడుతోంది. అయితే సినిమా మాత్రం శ్రీమంతుడు తరహాలో సాగదని, 

కాకపోతే శ్రీమంతుడు మాదిరి ఈ సినిమా కూడా ఒక ఊరిలోని ప్రధాన సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనపడనున్నట్లు టాక్ వినపడుతోంది. అలానే ఆయన క్యారెక్టర్ తో పాటు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో నటించే హీరోయిన్, మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని, వారి వివరాలు అతి త్వరలో అధికారిక ప్రకటన రూపంలో వెలువడనున్నాయని సమాచారం....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: