ఈ ఇద్దరూ ఎవరో గుర్తు పట్టారా..!

siri Madhukar
టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.  గతంలో ఆయన కామెడీ, మాఫియా, హర్రర్ సినిమాలు తీస్తూ మంచి క్రేజ్ సంపాదించారు.  ఇటీవల కాలంలో వర్మకు ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. తెలుగులో రక్త చరిత్ర తర్వాత ఆ స్థాయి హిట్ మళ్లీ అందుకోలేకపోయారు రాంగోపాల్ వర్మ. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్న తన ట్విట్టర్ తో ఏదో ఒక విషయంపై సంచలనం సృష్టిస్తున్నారు.

ఆ మద్య ఏపిలో ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో తెగ హల్ చల్ చేశారు. ఒక రకంగా ఏపిలో ఈ మూవీ చాలా ప్రభావం చూపించిందనే చెప్పొచ్చు. ఈ మూవీలో టీడీపీ అధినేత చంద్రబాబు ని విమర్శిస్తున్నట్లు ఉందని ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించారు. మొత్తానికి ఏపిలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ చేశారు.  తాజాగా రాంగోపాల్ వర్మ మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు.  ఆయన తెరకెక్కిస్తున్న మూవీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఏపీ రాజకీయాలను ప్రతిబింబించేదిగా భావిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే, తన సినిమాకు ప్రమోషన్ వర్క్ అప్పుడే మొదలు పెట్టారు.  ఈ మూవీపై ఫోకస్  కల్పించేందుకు  ట్విట్టర్ వేదికగా ఒక్కో ఫోటో రివీల్ చేస్తూ హంగామా చేస్తున్నారు.  తాజాగా, ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్టు చేసి ఇందులో ఉన్న ఇద్దరు క్యారక్టర్లు ఎవరో చెబితే బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు, దీపావళి రోజున 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. మొత్తానికి ఈ మూవీ ఏపి రాజకీయాల్లో ఎంత వరకు సెన్సేషన్ సృష్టిందో వేచి చూడాలి. 



I will give a gift to anyone who can guess who these 2 characters from kadapa REDDLU' target='_blank' title='kamma rajyamlo kadapa reddlu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">kamma rajyamlo kadapa reddlu are ? Trailer releasing on diwali Oct 27 th 9.36 Am #KRKR pic.twitter.com/HdejzFG6l6

— ram gopal varma (@RGVzoomin) October 25, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: