విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా షూటింగ్ సమయంలో అసహనం వ్యక్త పరచడం తన ఇగోతో ఆమూవీ షూటింగ్ స్పాట్ నుండి వాక్ అవుట్ చేసి వెళ్ళిపోవడానికి సంబంధించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ కు ఉన్న యాటిట్యూడ్ వల్ల అతడిని గతంలో కొన్ని సినిమా నిర్మాణ సంస్థలు తమ సినిమాల నుండి తొలగించడమే కాకుండా అతడిని ఫిలిం ఇండస్ట్రీ నుండి డిబార్ చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి.
ఈయాటిట్యూడ్ భరించలేక ప్రకాష్ రాజ్ ను చాలామంది పక్కకు పెట్టేస్తున్నారు. దీనితో వాస్తవాన్ని గ్రహించిన ప్రకాష్ రాజ్ తన అహంకారాన్ని తగ్గించుకుని పరిస్థితులతో రాజీపడుతూ ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడు లేటెస్ట్ గా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీలో ఒక కీలక పాత్రను చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న షూటింగ్ లో మొన్న బుధవారం ప్రకాష్ రాజ్ ప్రవర్తించిన తీరుకు ఈమూవీ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ గట్టి సమాధానం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించిన బాలకృష్ణ ప్రకాష్ రాజ్ భూమికల పై చిత్రీకరిస్తున్న ఒక సీన్ చిత్రీకరణ సమయంలో భూమిక చేసిన పొరపాటుకు ప్రకాష్ రాజ్ అసహనంతో ఆమె పై గట్టిగా అరిచినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో షాక్ అయిన సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ ‘నీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది షూటింగ్’ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడని తెలుస్తోంది. దీనితో షాక్ అయిన ప్రకాష్ రాజ్ మరింత కోపం తెచ్చుకుని షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతడిని ఎవరు బతిమాలక పోవడంతో ప్రకాష్ రాజ్ తనకు తానే తన కోపాన్ని తగ్గించుకుని తిరిగి షూటింగ్ స్పాట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో తనకోపం వల్ల తనకు తగ్గిపోతున్న అవకాశాలను ప్రకాష్ రాజ్ గుర్తించాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..