ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరానరసింహారెడ్డి రోజురోజుకి హడావుడి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇక చిరు తర్వాతి సినిమా చిరు152 గురించి అప్పుడే చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం చేయబోతున్నారు. ఈ మధ్యే ఈ సినిమాను లాంచ్ కూడా చేయడం జరిగింది. అతి త్వరలోనే సెట్స్ మీదకు రాబోతుంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో చిరుకు జోడీగా హీరోయిన్ ఇంకా ఎంపిక చేసుకోలేదు చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ సినిమా చిరు సరసన హీరోయిన్ గా త్రిషను తీసుకుంటే బాగుంటుంది అని కొరటాల శివ భావిస్తున్నారు అని సమాచారం ఉంది. ఇప్పటికే త్రిషతో కూడా చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా త్రిష ని ఒకే చేసే అవకాశం ఉందని అంటున్నారు చిత్ర యూనిట్. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నయన్.. తమన్న ల పేర్లు కూడా మొదటిలో వినిపించాయి కానీ కొన్ని కారణాల వల్ల వారిని వద్ద అని అనుకోవడం జరిగింది. ఈ హీరోయిన్ల తో చిరు ఇటీవల పని చేశారు కాబట్టి ఈ సినిమాకు మరి అదే జోడీ అయితే ఫ్రెష్ ఫీల్ ఉండదనేది ఒక ఆలోచనతో వాళ్ళని వద్దు అని అనుకుంటున్నారు అని సమాచారం.
ఇంకో ఒక కారణం కూడా ఉంది అదే అధిక పారితోషికం చెల్లించాల్సి వస్తుందేమో అని. ఇక కొరటాల శివ సినిమాలో కథ ప్రధానంగా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కథలో లవ్ స్టొరీకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు అని తెలుస్తుంది.. ఇక చిరు వయసు ప్రకారం చూసుకున్నా లవ్ ఎపిసోడ్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అనే భావనలో ఉన్నారు. అందుకే హీరోయిన్ కోసం ఎక్కువ ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదనే అలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది.
ఐతే త్రిష లాంటి సీనియర్ వాళ్ళని తీసుకుంటే చిరుకు జోడీ బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నారు. త్రిష గతంలో చిరుతో ' స్టాలిన్ ' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలో కూడా త్రిషకు ఛాన్స్ వస్తే మాత్రం మెగాస్టార్ తో నటించడం రెండోసారి అవుతుంది.