గుణ శేఖర్ కు పీడకలలా మారిన వర్ణ !

frame గుణ శేఖర్ కు పీడకలలా మారిన వర్ణ !

K Prakesh
ఒక్కరోజులో 65 కోట్ల ఖర్చు గాలిలో కలిసిపోయింది. భారీ సినిమాగా విపరీతమైన అంచనాలు పెంచేస్తూ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అనుష్క భారీ చిత్రం ‘వర్ణ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తెలుగులో మాత్రం ఈచిత్రానికి క్రిటిక్స్ నుంచి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. దీంతో తెలుగులో ఈచిత్రం ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడే పరిస్థితి లేదని టాక్. మరో వైపు తమిళంలోనూ ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి యావరేజ్ రేటింగే వచ్చింది.  అయితే సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండటంతో తొలి రోజు కలెక్షన్లు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి. తొలి రోజు ఈచిత్రం రూ. 6 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు రూ. 65 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం కనీసం పెట్టబడి తిరిగి రాబట్టుకోగలదా? లాంటి సందేహాలు సినిమా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసి ఇప్పుడిప్పుడే సినిమా నిర్మాణ రంగంలో నిలదొక్కుకుంటున్న పివిపి బేనర్‌ వారికి గట్టి స్ట్రోక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈసినిమాను ఏరియాల వారిగా పివిపి బేనర్ వారు అమ్మివేయడంతో కొద్ది నష్టాలతో బయటకు వస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ సినిమా పరాజయం గుణ శేఖర్ నిర్మిస్తున్న ‘రాణిరుద్రమ’ మార్కెట్ పై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. వర్ణ సినిమాలాగే గుణ శేకర్ రానిరుద్రమ్మ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ‘వర్ణ’ పరాజయంతో బయ్యర్లు మరో భారీ చిత్రంగా రూపొందుతున్న రుద్రమ్మదేవి పై భారీగా పెట్టుబడులు పెట్టడానికి వెనకంజ వేస్తారు అని విశ్లేషకుల వాదన. ఎదిఎమైనా ‘వర్ణ’ పరాజయం దర్శకుడు గుణ శేఖర్ కు టెన్షన్ పెడుతుందనే అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: