అనుమానాలకు క్లారిటీ ఇస్తూ హరిద్వార్ లో ప్రత్యక్షం అయిన పవన్ కళ్యాణ్ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వినిపించాయి. పవన్ కు వెన్నునొప్పి పెరిగిపోవడంతో పవన్ ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాడని అంటూ అనేక గాసిప్పులు ప్రచారంలోకి రావడంతో పవన్ అభిమానులు కలవర పడ్డారు. 

అయితే ఈవార్తలకు చెక్ పెడుతూ పవన్ హరద్వార్ వెళ్ళడమే కాకుండా అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొని ఆకార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు ‘జనసేన’ వర్గాలు మీడియాకు విడుదల చేసారు. ఇటీవల వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచిన రాజేంద్ర సింగ్ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి పవన్ ను కలవడమే కాకుండా భారతదేశంలో నీటి కరువు తీరాలి అంటే ఏమిచేయాలి అన్న విషయమై గంటల కొద్ది చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 

అప్పట్లో రాజేంద్ర సింగ్ భారతదేశం గర్వింప తగ్గ ప్రొఫిసర్ జీడీ అగర్వాల్ ప్రధమ వర్ధంతికి రావాలి అని పవన్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ తన ఆరోగ్యం సహకరించక పోయినా తాను ఇచ్చిన మాటకోసం హరిద్వార్ వెళ్ళి జీడీ అగర్వాల్ ప్రధమ వర్ధంతిలో పాల్గొనడమే కాకుండా ఆ కార్యక్రమంలో ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ నిన్నసాయంత్రం డెహ్రాడూన్ చేరుకొని అక్కడ నుండి హరిద్వార్ లోని ఒక యాత్రా సదన్ లో ఒక సామాన్య వ్యక్తిలా బస చేయడం హాట్ న్యూస్ గా మారింది. ఆ కార్యక్రమ నిర్వాహకులు పవన్ కల్యాణ్‌ను సాదరంగా ఆహ్వానించడమే కాకుండా తలకు సంప్రదాయమైన తలపాగాను రాజేంద్రసింగ్ చుట్టారు. గంగా ప్రక్షాళన కోసం స్వామి నిగమానంద సరస్వతి 115 రోజులు నిరాహర దీక్ష చేసి ఎలా ప్రాణత్యాగం చేసిన విషయాన్ని వివరిస్తూ పవన్ ఉత్తేజకరమైన ప్రసంగం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో తిరిగి మళ్ళీ ఆరోగ్యంగా పవన్ కనిపిస్తూ ఉండటంతో అభిమానులు జోష్ లో ఉన్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: