' గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ' ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌... వ‌రుణ్‌కు దెబ్బ ప‌డింది..

VUYYURU SUBHASH
మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ - హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వాల్మీకి) సినిమా విజ‌య‌వంతంగా రెండోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్‌లో సిద్దార్థ్ హీరోగా తెర‌కెక్కి హిట్ అయిన జిగ‌ర్తాండా సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాను తెలుగులో నెటివిటికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి తెర‌కెక్కించ‌డంలో హ‌రీష్‌శంక‌ర్ స‌క్సెస్ అయ్యారు.


ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ చేసుకునే స‌రికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 19.63 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక రెండో వారంలోనూ ఈ సినిమాకు పోటీ లేక‌పోవ‌డంతో తిరుగులేకుండా దూసుకుపోనుంది. వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. ముర‌ళీ అధ‌ర్వ‌, మృణాళిని త‌దిత‌రులు న‌టించ‌చారు.


గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌ సినిమాకు టాక్ బాగున్నా నైజాంతో పాటు హైద‌రాబాద్, ఏపీలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న వ‌ర్షాలు సినిమా వ‌సూళ్ల‌కు దెబ్బేశాయి. వ‌రుస‌గా కురుస్తోన్న వ‌ర్షాల‌తో జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో నైజాంలో కీల‌క మార్కెట్‌గా ఉన్న హైద‌రాబాద్‌లో సైతం వ‌సూళ్ల‌కు పెద్ద దెబ్బే ప‌డింది. నైజాంలో ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికి కేవ‌లం 6 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. మ‌రో వారంలో సైరా రిలీజ్ కానున్న నేప‌థ్యంలో వ‌రుణ్ ఈ లోగా ఎంత రిక‌వ‌రీ చేస్తాడో ?  చూడాలి.


గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ కలెక్ష‌న్లు (రూ.కోట్ల‌లో ) :


నైజాం - 6.15


సీడెడ్ - 2.80


వైజాగ్ - 2.10


గుంటూరు - 1.50


ఈస్ట్ - 1.25


వెస్ట్ - 1.22


కృష్ణా - 1.28


నెల్లూరు - 0.73
--------------------------------
ఏపీ + తెలంగాణ = 17.03
--------------------------------


రెస్టాఫ్ ఇండియా - 1.10


రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ -  1.50


టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 19.63



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: