రవితేజ ‘బలుపు’ తగ్గలేదు

Prasad
చిన్న స్థాయి నుంచి హీరో గా ఎదిగిన నటుడు రవితేజ. తన ఢిఫెరెంట్ యాక్షన్ తో సినీ అభిమానులను ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్న హీరో రవితేజ. అయితే తన నటనతోనే చాలా సినిమాలను నిలబెట్టిన రవితేజ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులలో ఉన్నాడు. రవితేజ సినిమాలన్నీ వరసగా పరాజయం పాలవుతున్నాయి. వీర, దొంగల ముఠా, దరువు, నిప్పు, దేవుడు చేసిన మనుషులు.. ఇలా సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని ఆందుకోలేక పోతున్నాయి. అలాగే రవితేజ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ సినిమాలోనూ అదే నటన కనబరుస్తున్నాడని, పైగా హీరో గారి ముఖంలో వయస్సు మళ్లీన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే, నిర్మాతలకు రవితేజ పై నమ్మకం తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రవితేజ హీరోగా సారొస్తారు అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే రవితేజ హీరోగా బలుపు అనే సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఇంకా రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. దీంతో టాలీవుడ్ లో కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ బ్యాక్ గ్రాండ్ లేని రవితేజకు ఇన్ని ప్లాపులు, ఇన్ని విమర్శలు వస్తున్నా రవితేజపై నిర్మాతలకు నమ్మకం తగ్గక పోవడం గొప్ప విషయమని, దీన్ని బట్టే చూస్తే ఇంకా రవితేజ బలుపు (క్రేజ్) తగ్గలేదని సరదాగా కామెంట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: