పవన్ కళ్యాణ్ తన ‘అత్తారిల్లు’ సినిమా స్టామినాతో తెలుగు సినిమా పరిశ్రమ రికార్డుల చరిత్రను తిరగ వ్రాసాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలక్షన్ల పరంగా ప్రతిప్రాంతంలోనూ కొత్త బెంచ్ మార్కులను క్రియేట్ చేసి రికార్డులకే రికార్డుగా మారుతోంది. అంతే కాదు ఇంతవరకు ఏతెలుగు సినిమా సాధించని 16 కోట్ల బిజినెస్ ఓవర్సీస్ మార్కెట్ లోచేసి పవన్ మరో కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాడు. అంతే కాదు కర్ణాటక ప్రాంతంలో కూడా పవన్ ‘అత్తారిల్లు’ కొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తోంది.
ఇలా ఇప్పటివరకు తెలుగు సినిమాకు సంబంధించి ఉన్న రికార్డులన్నీ పవన్ కళ్యాణ్ ముందు సలాం చేశాయి. కాని ఓ రెండు రికార్డులు మాత్రం పవన్ హవాకు లొంగటం లేదు. అవి ‘మగధీర’ పేరునున్న అత్యధిక దియేటర్లలో 50 రోజులు రికార్డ్ , ‘సింహాద్రి’ పేరునున్న అత్యధిక దియేటర్లలో 175 రోజుల రికార్డ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమానే కాదు మరే సినిమా కూడా వాటిని అందుకునే పరిస్థితి కనిపించటంలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర ఆఫ్ దియేటర్సే కాని, నంబర్ ఆఫ్ డేస్ ను లెక్కించటం మానేశారు. కానీ రికార్డులు అంటే రికార్డులే. ఎవరు పట్టించుకున్నా లేకపోయినా అవి రికార్డు లు గానే మిగిలి పోతాయి.
ఇప్పుడు కాక పోయినా మరో సినిమా ద్వారా ఈ రికార్డులను పవన్ బ్రేక్ చెయ్యగలుగు తాడో లేదో చూడాలి. లేదంటే మరో హీరో ఈ రికార్డులను బ్రేక్ చేస్తాడా అనే విషయం రాబోతున్న రోజులలో తేలుతుంది. పవనిజమ్ తో వెలిగిపోతున్న పవన్ కళ్యాణ్ కు కూడ కొన్ని అసాధ్యాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యపోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: