సాహో ఈవెంట్ లో రాజమౌళికి అగ్రపూజ చేసిన అల్లు అరవింద్ !

Seetha Sailaja
‘సాహో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రాజమౌళిని కార్నర్ చేస్తూ వేసిన జోక్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. పూజలు చేసే సమయంలో ఎవరైనా ముందుగా గణపతి చేయకుండా అసలు పూజ చేస్తే ఫలితం ఎలా ఉండదో ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ భారీ సినిమా విడుదలకు ముందు ‘బాహుబలి’ రికార్డుల గురించి ఆ మూవీ గొప్పతనం గురించి కనీసం రెండు మాటలైనా మాట్లాడకుండా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అంటూ జోక్ చేసాడు అరవింద్. 

వాస్తవానికి అరవింద్ అన్న మాటలలో హాస్యం కనిపించినా ‘బాహుబలి’ తరువాత టాప్ హీరోల ఆలోచనలు అన్నీ మారిపోయి అత్యంత భారీ బడ్జెట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాయి. చిరంజీవి తన కెరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమా పైనా 100 కోట్లకు ముంచి ఖర్చు పెట్టకపోయినా తన ‘సైరా’ కోసం 250 కోట్లు ఖర్చు పెడుతున్నాడు.

లేటెస్ట్ గా అరవింద్ 15 వందల కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ లో రామాయణాన్ని తీయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసినవే. ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని రాజమౌళిని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వినాయకుడుగా పోలుస్తూ అరవింద్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. అయితే అరవింద్ పొగడ్తల వెనుక మరొక అర్ధం కూడ ఉంది అన్న మాటలు కూడ ఉన్నాయి. 

‘బాహుబలి’ తరువాత రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ లో అల్లు అర్జున్ ను కూడ ఉండేలా చేయాలని అరవింద్ నిర్మాత దానయ్య ద్వారారాజమౌళి పై చాల ఒత్తిడి చేసాడు అన్న వార్తలు గతంలో వచ్చాయి. అయితే రాజమౌళి ఆ ఒత్తిడికి లొంగలేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. దీనితో ఎప్పటికైనా రాజమౌళిని ప్రశన్నం చేసుకుని రానున్న రోజులలో బన్నీ కి అవకాశం ఇచ్చేలా ఇలా అరవింద్ రాజమౌళిని ఏకంగా గణపతి తో పోల్చి ఉంటాడు అంటూ జోక్ చేస్తున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: