విభిన్నమైన ప్రయోగాలతో సినిమాలు చేసి అలరించే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్షయ్ నటించిన తాజా సినిమా మిషన్ మంగళ్. తాజాగా రిలీజ్ అయిన ఈ ఈ స్పేస్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అటు ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకుల ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా కథ, కథనాల విషయానికి వస్తే ఇస్రోలో పని చేసే సైంటిస్ట్ రాకేష్(అక్షయ్ కుమార్) కు పిఎస్ఎల్వి ప్రయోగం ఫెయిల్ అయిన కారణంగా అతడికి డిమెషన్ ఇచ్చి మార్స్ డిపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
ఈ క్రమంలోనే తనకు జరిగిన అవమానం నేపథ్యంలో రాకేష్ చాలా తక్కువ ఖర్చుతోనే మార్స్ కు ఉపగ్రహాన్ని పంపిస్తానని సవాల్ చేసి ఆ టాస్క్‌ను టేకాప్ చేస్తాడు. రాకేష్‌కు ఓ మంచి ఐడియా ఇస్తుంది విద్యాబాలన్. ఇది ఎలాగూ సక్సెస్ కాదని డిసైడ్ అయిన ప్రాజెక్ట్ హెడ్ ఉద్దేశపూర్వకంగా అనుభవం లేని నలుగురు మహిళలను ఒక జూనియర్‌తో పాటు మరో రిటైర్డ్ శాస్త్రవేత్తని రాకేశ్ కు టీమ్ గా ఇస్తారు.
ఏ మాత్రం అనుభవం లేని వాళ్ల సహకారంతో రాకేశ్ ఆ మిషన్‌ను ఎలా సక్సెస్ చేశాడు ? అన్న కథాంశమే ఈ మిషన్ మంగళ్ స్టోరీ. ఇక ఈ సినిమాలో తాప్సీ - నిత్య మీనన్ - సోనాక్షి సిన్హా ఎవరికి వారు డిఫరెంట్ రోల్స్ లో వాహ్ అనిపించారు. అందరూ తమ పాత్రల వరకు బాగానే నటించినా మెయిన్ హైలెట్ మాత్రం విద్యాబాలన్‌దే అని చెప్పుకోవాలి.
స్క్రీన్ మీద అక్షయ్‌కుమార్ లాంటి స్టార్ ఉన్నా కూడా అతడిని డామినేట్ చేస్తూ కెరీర్ బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చింది. సగటు మహిళగా ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూనే తక్కువ నూనెతో పూరిలు చేసే హోమ్ సైన్స్ సూత్రాన్ని స్పేస్ శాటిలైట్ కి ముడిపెట్టే తీరులో సూపర్బ్ అనిపించింది. ఓవరాల్‌గా మంచి ఫీల్‌గుడ్ మూవీగా అందరి చేత ప్రశంసలు అందుకుంటోన్న మిషన్ మంగళ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంత వరకు కనెక్ట్ చేస్తుందో ? చూడాలి.