ఎక్స్ పోజింగ్ పై నయనతార వివాదాస్పద వ్యాఖ్యలు !

K Prakesh
టాప్ హీరోయిన్స్ దగ్గర నుండి చిన్న హీరోయిన్స్ వరకు ఎక్స్ పోజింగ్ కు రెడీ అంటున్న నేటి రోజులలో కేరళాకు చెందిన క్యూట్ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఈ మధ్య తాను కోలీవుడ్ హీరో ధనుష్ తో నటిస్తున్న ‘నైయాండి’ సినిమాలో తనను చాలా అసభ్యంగా చూపించారు అంటూ చెన్నై పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసి దక్షణ భారత సినిమా రంగంలో ఒక సంచలనం రేపింది. దీనితో కోలీవుడ్ నిర్మాతల మండలి నజ్రియా పై అనధికార బ్యాన్ విధించింది.  ఈ నేపధ్యంలో కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార నజ్రియా పై చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. నయన్ అభిప్రాయంలో సినిమాలలో ఎక్స్ పోజింగ్ అన్నది సర్వ సాధారణమైన విషయం అనీ అంటూ అంత ఎక్స్ పోజింగ్ అంటే భయం ఉన్నవాళ్ళు సినిమా రంగానికి రాకూడదని నజ్రియాకు క్లాస్ పీకింది నయన్. పెద్దపెద్ద హీరోయిన్స్ మారు మాట్లాడకుండా తమ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటే నజ్రియాకు ఏమిటి అభ్యంతరం అంటు నీతులు చెప్పింది నయనతార.  కోలీవుడ్ సినిమా రంగంలో ఇంత సంచలనం సృస్టించిన నజ్రియాకు మాత్రం మంచి నటిగా విమర్శకులు మార్కులు వేస్తున్నారు. ఇంత రగడ జరిగిన తరువాత కూడా తమిళ హీరో జై నజ్రియాను పిలిచి తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాను ప్రముఖ కోలీవుడ్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. ఇంతకీ నయనతార గీతోపదేశం నజ్రియా పై పనిచేస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: