మహేష్ ప్రవర్తనతో టాప్ హీరోల సినిమాల పై పెరిగిపోతున్న విరక్తి !

Seetha Sailaja
మహేష్ తన సినిమాల విషయమై అనుసరిస్తున్న తీరుకు అతడితో సినిమాలు తీసే రెగ్యులర్ నిర్మాతలు కూడ హడలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మహర్షి’ సినిమా సక్సస్ అయినా ఆమూవీని నిర్మించిన నిర్మాతలకు అదేవిధంగా ఆమూవీని కొనుక్కున్న బయ్యర్లకు పెద్దగా కలిసి వచ్చింది లేదు అన్నవార్తలు ఉన్నాయి. దీనికి కారణం ‘మహర్షి’ కి భారీ బడ్జెట్.  

ఇప్పుడు అదే సీన్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడ రిపీట్ అవుతోందా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమూవీకి క్యాస్టింగ్ విషయంలో విపరీతంగా పెరిగిన ఖర్చులతో పాటు ఈమూవీ షేర్ విషయంలో మహేష్ పెట్టిన కండిషన్స్ అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి మహేష్ కు షేర్ గా 50 కోట్ల వరకు పారితోషికంగా వెళుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనితో పెరిగిన ఖర్చులు మహేష్ పారితోషికం అన్నీ పోను తనకు మిగిలింది ఏమిటి అంటూ దిల్ రాజ్ మదనపడుతున్నా మహేష్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. దీనికితోడు సంక్రాంతి సీజన్ ఎంత పెద్దది అయినప్పటికీ ఈ సీజన్ కు కనీసం నాలుగు సినిమాలు వస్తాయి కాబట్టి సంక్రాంతి కలక్షన్స్ అంతా ‘సరిలేరు నీకెవ్వరు’ కు ఎలా వస్తాయి అంటూ ఈమూవీ బయ్యర్లు అడుగుతున్న ప్రశ్నలతో ఈమూవీ ప్రాజెక్ట్ కు క్రేజ్ ఉన్నా అత్యంత భారీ రేట్లకు దిల్ రాజ్ అమ్మలేకపోతున్నాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి.

అయితే ఇలాంటి పరిస్థుతులలో రానున్న రోజులలో మహేష్ తో మాత్రమే కాదు టాప్ హీరోలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు దొరికే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో బాలీవుడ్ టాప్ హీరోల తరహాలో టాలీవుడ్ టాప్ హీరోలు కూడ కేవలం లాభాలలో మాత్రమే వాటాలు తీసుకునే పరిస్థితి రాకపోతే భవిష్యత్ లో టాప్ హీరోలతో సినిమాలు చేసే నిర్మాతలు ఉండరని టాప్ హీరోలు తమకు తాముగానే సినిమాలు తీసుకోవలసిన పరిస్థుతులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటూ విస్తృతంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: