తెలుగు.. తమిళ భషల్లో కాజల్‌కి మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు భాషల్లోను ఆమె చాలా కాలంగా అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ఈ రెండు భాషల్లో ఆమె చేసిన సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటం విశేషం. తెలుగులో శర్వానంద్‌కి జోడీగా ఆమె రణరంగం సినిమా చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.
ఇక తమిళంలో జయం రవి సరసన కాజల్ కోమలి సినిమా చేసింది. ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకూడా అక్కడ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రణరంగం తమిళంలో కోమలి హిట్ కావాలనే కాజల్ కోరుకుంటోంది. అదే జరిగితే ఈ రెండు భాషల్లో ఆమెకి మరికొంత కాలం ఢోకా లేనట్టే. ఒకరకంగా చెప్పాలంటే కాజల్ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నట్టే తనతో పాటు చేసిన కొందరు హీరోయిన్లు ఇప్పుడు కనుమరుగైన కాజల్ మాత్రం ఇంకా కొత్త కొత్తగా కనిపిస్తూ అవకాశాలను దక్కించుకుంటుంది.