భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
ముఖ్యంగా అమెరికాలో ఓ బేబీ ఇప్పటివరకు 800కు పైగా డాలర్లు కలెక్షన్లు సాధించినట్లు...సమంత రికార్డులు సృష్టిస్తున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ పండితులు కామెంట్ చేస్తున్నారు. భర్త నాగచైతన్య రికార్డులను కూడా సమంత ఈ సినిమాతో అధిగమించినట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఓ బేబీ సినిమాతో సమంత నాగచైతన్య రికార్డులు కె ఎసరు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి.
విషయంలోకి వెళితే నాగచైతన్య కెరీర్ లో సోలో గా అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం 'మజిలీ'($799 K). ఇప్పుడు 'ఓ బేబీ' దానిని అధిగమించింది. తిరకాసు ఏమిటంటే 'మజిలీ' సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా సమంత నే నటించడం. మొత్తంమీద ఓవర్సిస్ పరంగా భర్త నాగచైతన్యని అధిగమించేసింది భార్య సమంత.