ప్రత్యర్ధులకు ఓపెన్ చాలెంజ్ విసిరిన పవన్ !!

K Prakesh

పవన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘అత్తారింటికి దారేది’ థాంక్స్ గివింగ్ మీట్ నిన్న దసరా పండుగ రోజున హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో జరిగింది. సామాన్యంగా సినిమా ఫంక్షన్స్ లో అతి తక్కువ మాట్లాడే పవన్ తన గురించి ఎన్నో తెలియని విషయాలు తన అభిమానులకు ఉద్వేకంగా మాట్లడాడు. తాను జీవితంలో హీరో అవ్వాలని అనుకొలేదనీ తనకు చదువు సరిగ్గా రాకపోవడంతో టెక్నిషియన్ గా మారుదాము అనుకుని అదీ కుదరక అనుకోకుండా హీరోగా మారానని చెపుతూ తాను నటించిన మొదటి సినిమా తనకు నచ్చలేదని చెప్పాడు, ‘గోకులంలో సీత’ సినిమా నుండి తనకు సినిమాల పై అభిరుచు ఏర్పడిందనీ చెపుతూ తాను నటించిన సినిమాలలో ‘తొలిప్రేమ’ సినిమా తనకు బాగా నచ్చిందని చెపుతూ ఆ తరువాత ఎన్నో సినిమాలు చేసినా తనకు మనసుకు నచ్చిన సినిమాగా ఇన్నిరోజులకు ‘అత్తారిల్లు’ దొరికిందనీ తన మనసుకు ఈ కధ అంతబాగా నచ్చింది కాబట్టే అందరికీ నచ్చే విధంగా నటించాననీ చెప్పాడు పవన్.

తాను చిన్నతనం నుండి ఒక రైతు కావాలని కోరుకున్నానని కనీసం ఒక అర ఎకరం అయినా కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడపాలనుకుంటే విధి వ్రాత బట్టీ తాను ఇన్నికోట్ల మందికి నచ్చే హీరోగా మారానని అని చెప్పాడు. తనకు చిన్నప్పటి నుంచి సద్దుకుని ఓపికగా ఉండటం అలవాటనీ చెపుతూ తన ఓపికను అసమర్ధతగా భావించి ఎవరైనా తనను టార్గెట్ చేస్తే తాను సహించననీ అంటూ ‘అత్తారిల్లు’ సినిమా పైరసీ విషయంలో అదే జరిగిందనీ ఇది అందరూ అనుకుంటున్నట్లుగా సామాన్య పైరసీ కాదనీ, ఇది ఒక పధకం ప్రకారం తనను దెబ్బ తీయాలని జరిగిన కుట్ర అనీ అంటు అత్తారిల్లు సూపర్ హిట్ అయినంత మాత్రాన తానంతా మరిచిపోయానని అనుకోవద్దనీ ఈ పైరసీ కుట్ర ఎవరు చేసారో తనకు తెలుసనీ తాను ఎవ్వరినీ వదలను అని ఓపెన్ చాలెంజి చేసాడు పవన్.

అభిమానులందరూ ప్రేమగా పిలిచే పవనిజం గురించి తనకు అర్ధం కూడా తెలియదనీ అంటు, సమాజం గురించి, దేశం గురించీ ఆలోచించడమే పవనిజం అన్నాడు పవన్. ‘ఖుషీ’ సినిమా తరువాత దాదాపు పదేళ్ళు తాను విపరీతమైన నిరాశకు లోనయ్యానని కానీ తాను ఎప్పుడూ చదివే ప్రముఖ కవి బాలగంగాధర్ తిలక్ కవిత్వంలోని ‘చీకట్లో దారికనిపించనప్పుడు ధైర్యమే నాకవచం’ అనే మాట  తనను నిలబెట్టిందనీ అంటు తనకిష్టమైన పదం జైహింద్ అంటూ ఆ పదాన్ని తన అభిమానులచేత గట్టిగా అనిపించాడు పవన్. ఉపన్యాసం చివర తన అభిమానుల చేత జైహింద్ ట్విస్ట్ ఇవ్వడం పవన్ త్వరలో రాజకీయాలలోకి వస్తాడు అనే అనుకోవడానికి సంకేతం అనుకోవాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: