అ! సినిమాతో అబ్బురపరచిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తర్వాత రాజశేఖర్ తో కల్కి సినిమా చేశాడు. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. డైరక్టర్ గా ప్రశాంత్ వర్మ మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో తను కథ రాసుకునే విధానాన్ని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.
ఎవరైనా కథ మొదలు పెట్టి చివరకు క్లైమాక్స్ రాసుకుంటారు. కాని ప్రశాంత్ వర్మ మాత్రం ముందు క్లైమాక్స్ రాసుకున్నాక దానికి తగిన కథను ఆలోచిస్తాడట. ఇదేదో విచిత్రంగా ఉంది కదా అ! సినిమా కూడా అదే పంథాలో తీశాడు ఈ డైరక్టర్. కల్కి కూడా అంతే ఫస్ట్, సెకండ్ హాఫ్ ల కన్నా క్లైమాక్స్ ఎక్కువ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసింది.
క్లైమాక్స్ రాస్తే మిగతా కథ అంతా చాలా ఈజీ అంటున్నాడు ప్రశాంత్ వర్మ. డెస్టినేషన్ తెలిస్తే మిగతాది అంతా సులభంగా ఉంటుందని అతని అభిప్రాయమట. 2 గంటలు ఆడియెన్ ను వెయిట్ చేయించి చివరగా సస్పెన్స్ రివీల్ చేయడమే తన స్క్రీన్ ప్లే అని చెబుతున్నాడు. అంటే ఇదంతా రివర్స్ మేళం అన్నమాట.
క్లైమాక్స్ కు ముందు ఆడియెన్స్ ను వెయిట్ చేయించడం ఓ కొత్తరకం స్క్రీన్ ప్లే నా సినిమాలు అలానే ఉంటాయని అంటున్నాడు ప్రశాంత్ వర్మ. కల్కి సినిమా కూడా అదే పంథాలో కొనసాగింది. అయితే క్లైమాక్స్ ఒక్కటే బాగుంటే సరిపోతుందా ముందు కథ కూడా బాగుండాలి కదా అని కొందరు అంటున్నారు. కల్కి సినిమాకు అదే దెబ్బ వేసిందని ఫస్ట్ హాఫ్ అంతా ఏదేదో తీశాడన్న కామెంట్స్ వస్తున్నాయి.