నిన్న భారీ అంచనాలతో విడుదలైన రాజశేఖర్ ‘కల్కి’ శ్రీవిష్ణు ‘బ్రోచేవారు ఎవరురా’ మూవీ పోటీతో చతికల పడింది. వాస్తవానికి ‘కల్కి’ విడుదల అయ్యేంతవరకు ఈమూవీ పై అంచనాలు చాల ఎక్కువగా ఉన్నాయి. ఆ అంచనాలు అందుకోవడంలో ‘కల్కి’ విఫలం చెందడానికి ఈమూవీలో రాజశేఖర్ ఎంత కష్టపడినా చేసిన చిన్నచిన్న పొరపాట్లు ఈమూవీకి శాపంగా మారాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం రాజశేఖర్ వయసు 50 దాటిపోయింది. దీనితో లుక్ పరంగా రాజశేఖర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతడి మోహంలో వచ్చిన ముడతలను అతడికి ఇచ్చిన మేకప్ ఏమాత్రం కవర్ చేయలేకపోయింది. దీనికితోడు రాజశేఖర్ ఈమూవీలో తనకు మెయిన్ హీరోయిన్ గా ఆదా శర్మను పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ చాల వికృతంగా మారాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీనికితోడు సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నప్పుడు వారి పై ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. వెండితెర మన్మధుడుగా పేరు గాంచిన నాగార్జున ‘మన్మధుడు 2’ లో రకుల్ ప్రీత్ తో నటించిన రొమాంటిక్ సీన్స్ పై కూడ విపరీతంగా ట్రోలింగ్ జరిగిన నేపధ్యంలో రాజశేఖర్ తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తే బాగుంటుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
దీనికితోడు ‘కల్కి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈమూవీ ఫస్ట్ ఆఫ్ ను చాల స్లోగా నడిపించడంతో పాటు ఈమూవీలో హాస్యం బాగా తక్కువ కావడం ఈమూవీకి శాపంగా మారాయి. దీనితో ‘గరుడవేగా’ తో వచ్చిన సక్సస్ ను రాజశేఖర్ కొనసాగించలేకపోయాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. భవిష్యత్ లో రాజశేఖర్ ‘కల్కి’ మూవీలో చేసిన పొరపాట్ల నుండి తిరిగి పాఠాలు నేర్చుకోలేకపోతే మళ్ళీ రాజశేఖర్ కు కష్టకాలం మొదలైనట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..