టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) తాజాగా రెండో వివాహం చేసుకున్నారు. తండ్రికి తోడుగా నిర్మాణం, బిజినెస్ బాధ్యతల్లో సాయం ఉండే బాబీకి ఇంతకు ముందే వివాహమైంది. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. ఇక బాబీ రెండో పెళ్లిపై ముందుగా ఎవ్వరికి సమాచారం లేకపోవడం... ఒక్కసారిగా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
పెళ్లికి బాబీ సోదరుడు అల్లు అర్జున్ కూడా రాకపోవడం కూడా ఒక హాట్ టాపిక్ అయింది. సరే ఇదిలా ఉంటే బాబీ తన రెండో వైవాహిక జీవితాన్ని ఆరభించేయడంతో మెగా ఫ్యామిలీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. బాబీ ముందుగా నీలిమను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అన్విత అనే పాప కూడా ఉంది. మనస్పర్థల నేపథ్యంలో వీరు 2015లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వీరిని కలిసి ఉంచేలా చేసేందుకు అల్లు అరవింద్ విఫల ప్రయత్నాలు చేశారు.
బాబీ, నీలిమ విడిపోయినా వీరు పాప కోసం మాత్రం కలుస్తూనే ఉంటారట. ఇప్పుడు ముంబైకి చెందిన నీలూషాను రెండో వివాహం చేసుకున్నాడు. విడాకులపై స్పందించిన బాబీ మొదటి భార్య నీలిమ కూడా తమ ఫ్యామిలీ మెంబర్ లాంటిదే అని.. తమ పాప కోసం తాము ఎప్పుడూ కలుస్తూనే ఉంటామన్నాడు. ఏదేమైనా అల్లు వారసుడి విడాకులపై సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చపై మనోడు ఫుల్స్టాప్ పెట్టేశాడు.