ఈరోజు విడుదల అవుతున్న ‘హిప్పీ’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ జేడీ చక్రవర్తి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈమూవీలో జేడీ చక్రవర్తితో కలిసి తాను నటిస్తున్నాను అని తెలియగానే తనను కొంతమంది విపరీతంగా భయపెట్టిన విషయాలను వివరించాడు.
జేడీకి షూటింగ్ లో కోపం వస్తే సెట్ లో తనతో నటించే నటీనటుల పై తీవ్ర అసహనం వ్యక్తపరచడమే కాకుండా షూటింగ్ నుంచి మధ్యలో వెళ్ళిపోతాడనే విషయాలు చెప్పి తనను భయపెట్టిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు.అయితే దీనికి భిన్నంగా జేడీ ప్రవర్తన ఉందనీ ఇదే విషయాలు తాను జేడీ చక్రవర్తిని అడిగితే తన గురించి చాల రూమర్లు ఉన్నాయి అవి తెలియవా అంటూ తనతో జోక్ చేసిన విషయన్ని గుర్తుకు చేసుకున్నాడు.
ఈమూవీ షూటింగ్ సమయంలోనే కాకుండా ఈమూవీ షూట్ పూర్తి అయిన తరువాత కూడ జేడీ తనతో సాన్నిహిత్యంగా కొనసాగుతున్న విషయాలను వివరిస్తూ మంచి టాలెంట్ ఉన్న జేడీ ఎందుకు పూర్తిగా రాణించలేకపోయాడో తనకు అర్ధం కాలేదు అంటూ కామెంట్ చేసాడు.ఇదే సందర్భంలో తన కెరియర్ గురించి మాట్లాడుతూ తాను ఎప్పుడూ హీరోని అని అనుకోవడం లేదనీ దీనికికారణం తనకంటే తన బాడీకి మంచి పేరు వచ్చిన నేపధ్యంలో తనను తాను నటుడుగా నిరూపించుకునే పాత్ర కోసం ఎదురు చూస్తున్న విషయాలను వివరించాడు.
ప్రస్తుతం సినిమాలలోని లిప్ లాక్ సీన్స్ గురించి మాట్లాడుతూ పాత కాలంలో గొడుగు అడ్డం పెట్టి లిప్ లాక్ సీన్స్ చూపెట్టేవారనీ అయితే ఇప్పుడు అలా చూపెడితే ఎవరు చూస్తారని అంటూ ప్రేక్షకులు వాస్తవికతో కూడిన సన్నివేశాలు ఆశిస్తున్న నేపధ్యంలో ఇలా రొమాంటిక్ సీన్స్ చాల హాట్ గా చూపించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని అంటున్నాడు.ప్రస్తుతం హీరోగా నటిస్తూనే నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో విలన్ పాత్రను చేస్తున్న కార్తికేయ రానున్న రోజులలో పూర్తిగా విలన్ గా సెటిల్ అవుతాడా లేదంటే హీరోగా కొనసాగుతాడా అన్న విషయం ‘హిప్పీ’ పై ఆధారపడి ఉంటుంది..