అర్దరాత్రి హంగామాలో గాయపడిన కాజల్ మనసు !

Seetha Sailaja
ఎంతమంది యంగ్ హీరోయిన్స్ వచ్చినా కాజల్ కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు ఆమె ఎప్పటికప్పుడు మరింత రెచ్చిపోతు తన గ్లామర్ ను మరింత ఎక్స్ పోజ్ చేస్తూ ఇస్తున్న ఫోటో షూట్స్ కాజల్ క్రేజ్ ను మరింత పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమె లేటెస్ట్ గా ముంబాయిలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో సముద్రం దగ్గర హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇచ్చిన ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

పింక్ కలర్ గౌన్ వైట్ కలర్ షూ ధరించి లూజ్ హెయిర్ తో పెద్దగా మేకప్ చేసుకోకుండా కెమెరాకు పోజులు ఇస్తూ తీయించుకున్న ఈ ఫోటో షూట్ లో ఈ ప్రాంతంతో తనకు ఉన్న అనుబంధాన్ని షేర్ చేసింది. ఇదే ప్రాంతంలో తాను ఎన్నో సార్లు చాల జాలీగా నవ్వుతు గడిపిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఋతుపవనాల సమయంలో చిరుజల్లులు పడుతూ ఉంటే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ అర్దరాత్రి ఐస్ క్రీమ్స్ తిన్న సందర్భాలను గుర్తుకు చేసుకుంది.

అంతేకాదు ఇదే స్థలంలో తాను తన మనసుకు గాయం అయినప్పుడు తనివితీరా ఏడ్చిన సందర్భాలను గుర్తుకు చేసుకుంది. దీనితో కాజల్ మనసుకు ఎందుకు గాయం అయింది అన్న సందేహాలు ఎవరికైనా ఏర్పడతాయి. 

ప్రస్తుతం కాజల్ సీనియర్ హీరోలకు హీరోయిన్ గా నటిస్తూనే కొంతమంది యంగ్ హీరోలతో కూడ నటిస్తూ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటోంది. కమలహాసన్ తో ‘భారతీయుడు 2’ లో నటిస్తున్న కాజల్ చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ లో కూడ నటించే అవకాసం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: