అనసూయకు సమంత పోరు !

Seetha Sailaja
సమంత సినీ కెరీర్‌ లో నటించిన మంచిపాత్రల లిస్టులో త్రివిక్రమ్ 'అ ఆ' మూవీలోని  'అనసూయ రామలింగం’ ఒకటి. 'అ ఆ' సినిమాలోని ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. 

ఈ నేపధ్యంలో ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తి అయిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటు సమంత ఒక మెసేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘అనసూయకు మూడేళ్లు. దీని తర్వాత 'ఓ బేబీ' ద్వారా మరోసారి కామెడీ పాత్రను చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ‘ఓ బేబీ' అనసూయకు వంద రెట్లు కామెడీగా ఉంటుంది. 'అ ఆ' లోని పాత్రకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నాను. అది నా నాలుగో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు' అని ఆమె గుర్తుకు చేసుకుంది.

ఇది ఇలా ఉండగా ‘ఓ బేబి’ టీజర్ కు ఐదు మిలియన్స్ వ్యూస్ రావడంతో ఈమూవీ దర్శకురాలు నందినీ రెడ్డి సమంతల ఆనందానికి నిర్మాత సురేశ్ బాబు కామెంట్స్ నిరుత్సాహం కలగచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ అవుట్ పుట్ ను చూసి సురేశ్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచినట్లు టాక్. 

దీనితో జూలై 5న విడుదల కాబోతున్న ఈమూవీ విషయంలో చివరి నిముషం రిపేర్లు మొదలయ్యాయి అని తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో భారీ బిజినెస్ జరిగిన నేపధ్యంలో ఇప్పుడు సురేశ్ బాబు కామెంట్స్ వార్తలు విని ఈమూవీ బయ్యర్లు తెగ భయపడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: