"నాతో నటించటానికి అమ్మాయిలు మొగుళ్ళని వదిలేసి వస్తారు" హీరో గారి సొల్లు వాగుడు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సినిమా 'భారత్' నుంచి నటి ప్రియాంక చోప్రా తప్పుకోవడంపై ఈ మద్య చేసిన వ్యాఖ్యలు నెమ్మదిగా వివాదంగా రగులుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'భారత్' త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా 'భారత్'లో నటించేందుకు ముందుగా ఒప్పుకున్న ప్రియాంక, ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఎందుకో చెప్పకుండా తప్పుకుందని ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె పెళ్లి చేసుకుందని, బహుశా పెళ్లి కోసమే సల్మాన్ ఖాన్ సినిమా నుంచి ప్రియాంక తప్పుకుందేమో! అనే అభిప్రాయాలు వినిపించాయి.

ఇదంతా సినిమా ప్రమోషన్ పనుల్లో భాగంగా సల్మాన్ ఖాన్ ఆ సినిమాకు ముందుగా హీరోయిన్ గా అనుకున్న ప్రియాంక చోప్రా విషయంలో  ఆమె వెళ్లిపోయింది. మాకు నష్టం ఏమీకాలేదు. ఆమె మొగుడి కోసం నా సినిమాను వదులుకుంది. నా సినిమా కోసం చాలామంది ఆడవాళ్లు మొగుళ్లను వదిలేసి వస్తారు..అంటూ వ్యాఖ్యానించాడు. 

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను కొంతమంది తప్పు పడుతున్నారు. 'నిజమైన మగవాళ్లు ఎవరూ అలా మాట్లాడరు..' అంటూ కొందరు ధ్వజమెత్తుతున్నారు. ప్రియాంక చోప్రా ఒక నిజమైన మగాడి కోసం సల్మాన్ సినిమాను వదిలేసుకుందని కూడా కొందరు, ఆమె తప్పుకున్న తర్వాత కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా తీసుకుని ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గురించి మీడియా సల్మాన్ ఖాన్ వద్ద ప్రస్తావించగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారమే రేపాయి. 

అయితే సల్మాన్ అదేదో సరదాగా అన్నట్టుగా నవ్వుతూ, ప్రియాంక చోప్రా గురించి ఆమెపై తనకు కోపం లేదని, ఆమెతో తిరిగి నటించడానికి మళ్లీ సిద్ధం అని సల్మాన్ ఖాన్ ముక్తాయింపు. సల్మాన్ ఖాన్ అలా మాట్లాడటంపై ఇప్పుడు కొందరు స్త్రీవాదులు స్పందిస్తూ ఉన్నారు. ప్రియాంక గురించి కాదు కానీ, 'నా సినిమా కోసం ఆడవాళ్లు మొగుళ్లను వదిలేసి వస్తారు..'అని సల్లూ భాయ్ చేసిన సొల్లు వ్యాఖ్యలపై వివాదం మొదలవుతోంది. నెట్టింట నెటిజెనులు మాత్రం సల్మాన్ పై పంచ్ లు వేస్తున్నారు!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: