మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి షూటింగ్ ముగింపుదశకు చేరుకుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హింది భాషల్లో భారీ స్థాయిలో సైరా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సైరా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మిర్చి నుండి భరత్ అనే నేను సినిమా వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న కొరటాల శివ చిరుతో సినిమా అనగానే ఈ కాంబినేషన్ పై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. కన్నడలో వచ్చ్న యూటర్న్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళంలో విక్రం వేధ సినిమాలో కూడా సత్తా చాటింది. ఈమధ్యనే నాచురల్ స్టార్ నాని సరసన జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అందుకే ఏకంగా మెగాస్టార్ కళ్లల్లో పడ్డది. కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో అనుష్క ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుండగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ లక్కీ ఛాన్స్ అందుకుందట. తెలుగులో రెండో సినిమానే చిరంజీవి ఛాన్స్ పట్టింది అంటే ఇక మిగతా హీరోయిన్స్ శ్రద్ధా గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు.