టాలీవుడ్‌లో ఎవ్వరూ కలలో ఊహించని కాంబినేషన్ సెట్ అయ్యేందుకు రంగం సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ త్వరలోనే పట్టాలెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మణి ఈ సినిమాలో నటించే నటీనటుల కోసం చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జయం రవి, మోహన్ బాబు, ఐశ్వర్య రాయ్ ఇంకా ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో ఆసక్తికర కథనం ఒకటి తెగ ప్రచారం జరుగుతోంది.
మన టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు జోడీగా ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. అసలు ఈ కాంబినేషన్ గురించి ఎవ్వరూ కలలో కూడా ఊహించరు. అయితే ఇది నెగిటివ్ చాయలు ఉన్న పాత్ర అని తెలుస్తోంది. రాజ్యం కోసం ఎంతకు అయినా తెగించే పాత్రలో ఐశ్వర్య కనిపించబోతోందట. రాజ్యాధికారం కోసం ఐశ్వర్య నమ్మక ద్రోహానికి పాల్పడుతుందట. గతంలో విలన్ సినిమాలో కూడా ఐశ్వర్యకు మణి మంచి రోల్ ఇచ్చాడు.
ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్ చాయలు ఉన్న పాత్ర అయినా నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఐష్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇక మోహన్‌బాబు ఆమె భర్త / లవర్ పాత్రలో నటిస్తున్నాడు. మోహన్‌బాబు కూడా నటనలో ఎంత స్పెషాలిటీ చూపిస్తాడో తెలిసిందే. మోహన్ బాబు మరియు ఐశ్వర్య రాయ్ కాంబో అంటే అంతా కూడా అవాక్కవుతున్నారు.
10వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కే ఈ సినిమాలో ఇంకా ఎన్నో షాకింగ్ కాంబినేషన్‌లు, షాకింగ్ న్యూస్‌లు ఉండబోతున్నాయట. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మణి పక్కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాతే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.