సమంతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ భార్య..!
సమంత రిలీజ్ చేసిన వీడియో లో మహేష్ బాబు ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయమని తేల్చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే మరియు సినిమా యూనిట్ కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పింది.
ఈ సందర్భంగా తన భర్త మహేష్ బాబు పై సమంతా చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా సమంతకు ధన్యవాదాలు చెప్పారు.ఈ మేరకు సమంత వీడియోను షేర్ చేస్తూ.. ''సామ్ నువ్వంటే మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. సితార మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. 'మహర్షి'కి శుభాకాంక్షలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు'' అంటూ రాసుకొచ్చింది.