ఈ గేమ్ లో ముందు పవన్ వెనుక జూనియర్ మరి మధ్య ఎవరు?

K Prakesh

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ ద్రుష్టి అంతా నాలుగు బడా సినిమాల భవితవ్యం పై ఉంది ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘భాయ్’ సినిమాలు తమ నిర్మాణ కార్యక్రమాలు అన్నీ పూర్తిచేసుకుని విడుదల కోసం క్యూ కడుతున్నాయి. సమైక్య ఉద్యమ సెగల నేపధ్యంలో ఎప్పుడో విడుదల కావలసిన ‘ఎవడు’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు తమ దారి తెలియక ఆగిపోవడంతో ఈ పరిస్థుతుల మధ్య మరొక లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో హాల్ చల్ చేస్తోంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ చిత్రం అత్తారింటికి దారేది విడుదలైన వారానికే ఎన్టీఆర్ తాజా చిత్రం రామయ్య వస్తావయ్యా చిత్రం విడుదలకు సిద్దమవుతోందని ట్రేడ్ టాక్. ఈ రెండు చిత్రాలు ఒకదానికి మరొకటి పోటీగా వస్తున్నాయి అని అంటున్నారు. తెలుస్తున్న  సమాచారం ప్రకారం ‘అత్తారింటికి దారేది’ చిత్రం గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ 2న వస్తుందనీ, అలాగే ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం అక్టోబర్ 10 న విడుదల చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. దసరా సీజన్ ని ఈ ఇద్దరు హీరోలు క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇంచుమించుగా ఇప్పటికే రిలీజ్ డేటును ఖాయ పరుచుకున్న నాగార్జున ‘భాయ్’ పరిస్థితి ఏమిటీ అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ వార్తలు ఇలా ఉంటే నిర్మాత దిల్ రాజ్ తన ‘ఎవడు’ సినిమా హక్కులను టోటల్ గా అల్లుఅరవింద్ కు అమ్మివేసడనే వార్త కొన్ని ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలలో కనిపిస్తోంది.

ఇలా ఒకదానికి ఒకటి పొంతన లేని వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న నేపధ్యంలో ముందుగా బాబాయ్ ఆ తరువాత వచ్చే బుడ్డోడు సినిమా ఫలితాలను చూసి తన మామయ్య అల్లు అరవింద్ ద్వారా భారీ ప్లాన్ తో దీపావళికి ‘ఎవడు’ వస్తుంది అని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. అయితే ఇప్పటి వరకూ చిన్న సినిమాలతో కాలం గడుపుతున్న ధియేటర్లు ఓకేసారి కేవలం నెల రోజుల మధ్య మూడు భారీ సినిమాల విడుదలకు పరిస్థితి అనుకులిస్తుందా? కనీసం అక్టోబర్ లో అయినా ఈ భారీ సినిమాలకు దారిదోరుకుతుందా అంటు ఫిలింనగర్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ వెరైటీ మ్యూజికల్ చైర్స్ గేమ్ కు అంతం ఎప్పుడో మరి.... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: