జయలలిత బయోపిక్ ‘తలైవి’టైటిల్ ఫిక్స్!

siri Madhukar
ఈ మద్య అన్ని భాషల్లో బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న టైమ్‌లో తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బయోపిక్స్‌లో జయలలిత బయోపిక్‌ ఒకటి. తెలుగు లో మహానటి తర్వాత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీశారు.  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. అయితే ఈ రెండు భాగాలు కూడా పెద్దగా ఆకర్శించలేక పోయాయయిని..థియేటర్లో మిశ్రమ స్పందన వచ్చిందని టాక్ వినిపించింది.  బాలీవుడ్ లో సైతం సినీ, రాజకీయ నేపథ్యంలో బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. 

ఇక తమిళ నాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని నటి, రాజకీయ నాయకురాలు జయలలిత అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఆమె మరణం తర్వాత తమిళ నాడు రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.  తమిళ ప్రజలు ఎంతో ప్రేమతో జయలలితను అమ్మా అని పిలుస్తారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లిన అమ్మ జీవిత కథ ఆధారంగా బయోపిక్ సినిమాలు నాలుగు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక గౌతమ్ మీనన్ అయితే టివి సీరియల్ తీయడానికి సిద్దమయ్యారు. 

ఓ వైపు ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ‘ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంటే.. మరోవైపు ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. జయలలిత బయోపిక్ తీయడానికి ఆయన తొమ్మిది నెలలు రీసర్చ్ చేశారట. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటించారు.  విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: