నాని పుట్టినరోజునాడు సమంత వ్యూహాత్మక షాక్ !

Seetha Sailaja
నేచురల్ స్టార్ నాని ఈరోజు తన పుట్టినరోజు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న నేపధ్యంలో సమంత నానీకి ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నానీ ‘జెర్సీ’ మూవీని ఏప్రియల్ 19వ తారీఖున విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. 

సమంత నాగచైతన్యలు నటించిన ‘మజిలీ’ మూవీని ముందుగా అనుకున్నట్లుగా ఉగాదిని టార్గెట్ చేస్తూ ఏప్రియల్ 5న కాకుండా ఈమూవీని కూడ ‘జెర్సీ’ విడుదల అయ్యే ఏప్రియల్ 19న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ‘మజిలీ’ యూనిట్ ఉన్నట్లు టాక్. ఇలా నానీ సమంతల సమ్మర్ వార్ కు రంగం సిద్ధం కావడానికి ఈ రెండు సినిమాల కథ క్రికెట్ నేపధ్యంలోనే జరగడం అని అంటున్నారు. 

అయితే ఇప్పటికే వరస పరాజయాలతో సతమతమవుతున్న చైతన్య ‘మజిలీ’ ని పోటీ లేకుండా ముందుగా విడుదల చేయాలని భావించినా ఏప్రియల్ మూడవ వారానికి కానీ పరీక్షలు పూర్తి కాని నేపధ్యంలో ఇలా అనుకోకుండా సమంత నానీల వార్ అనివార్యం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏప్రియల్ మూడవ వారంలో ఎన్నికల ప్రచారం తారా స్థాయిలో ఉండి ఎన్నికల తేది అతి సమీపంలో ఉంటుంది కాబట్టి ఆ హడావిడి మధ్య ఈ రెండు సినిమాల వార్ మరుగున పడిపోయే ఆస్కారం ఉంది అనే సందేహాలు నానీతో పాటు సమంతకు కూడ ఉన్నట్లు టాక్. 

దీనితో నానీతో వార్ కు రెడీ అవ్వాలా లేదంటే ముందుగా అనుకున్నట్లుగానే ఉగాది పండుగకు సందడి చేయాలా అన్న విషయమై మజిలీ యూనిట్ తీవ్ర అంతర్మధనంలో ఉందని అంటున్నారు. దీనికితోడు రెండు వరస పరాజయాలు ఎదుర్కున్న నానీకి మూడు వరస పరాజయాలు ఎదుర్కున్న నాగచైతన్యకు ఈ రెండు సినిమాల విజయం ఎవరికీ వారికి కీలకంగా మారడంతో నానీ సమంతల మధ్య ఏప్రియల్ లో జరగబోతున్న రియల్ సమ్మర్ వార్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: