నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలు ఇవేనా!

Edari Rama Krishna
గత వారం రోజులుగా టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఎన్నో ట్విస్టులు నెలకొంటూ వస్తున్నాయి. ఈ కేసులో ఆమె ప్రియుడు సూర్యతేజపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతూ వచ్చాయి.  ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు సూర్యతేజ ఆమె ఆత్మహత్యకు సంబంధించి కొత్త విషయాలను వెల్లడించాడు.  సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఝాన్సీ మరణం వెనుక ఆమె ప్రియుడు సూర్యతేజకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన పరిస్థితుల వెనుక అతను ఉన్నాడని, న్యాయ నిపుణుల సలహా, సూచనల మేరకు అతనిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.

ఆమె ప్రియుడు సూర్య తేజ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝాన్సీకి బాబి, గిరి అనే ఇద్దరు ఫొటో షూట్ చేసేవారు. ఆ ఇద్దర్నీ నమ్మొద్దని పలుమార్లు ఝాన్సీకి చెప్పాను. సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని ఆమెను మోసం చేశారు. గిరి పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝాన్సీ నాకు చాలాసార్లు చెప్పింది. దీంతో గిరికి నేను ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాను. సినిమా ఆఫర్లు తగ్గడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పుకొచ్చాడు. సూర్యతేజ వ్యాఖ్యలతో పోలీసులు బాబి, గిరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తోంది.

అరెస్టు చేసిన పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. మధు అనే యువతి ద్వారా సూర్యతేజకు ఝాన్సీ పరిచయమైందని, వారిద్దరూ ప్రేమలో పడ్డారని, ఆపై నటించడం ఆపేయాలని అతను ఒత్తిడి తెచ్చినా, ఝాన్సీ ఆ పని చేయలేదని పోలీసులు తెలిపారు.  ఈ విషయంలో తరుచూ వారి మద్య గొడవలు రావడం.. సూర్యతేజ, మొబైల్‌ నంబర్‌ ను బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టాడు.

ఇక  ఝాన్సీ ఫోన్ చేసినా దానికి అతను స్పందించలేదు.  వారిద్దరి మొబైల్ ఫోన్లను పూర్తిగా పరిశీలించామని, సూర్యతేజను విచారించామని వెల్లడించిన పోలీసులు, ప్రియుడు అనుమానిస్తుండటం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడం.. తదితర కారణాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: