నిజమే.. వెంకటేశ్ మరీ ఓవర్ చేస్తున్నాడు..?

Chakravarthi Kalyan
ఔను.. నిజమే.. విక్టరీ వెంకటేశ్ మరీ ఓవర్ చేస్తున్నాడు.. అదేంటీ ఎఫ్‌ 2లో బాగానే చేశాడుగా.. సందర్భోచితంగానే చేశాడుగా.. పాత్ర పరంగా ఆ మాత్రం చేయాలిగా అంటారా.. నిజమే.. కానీ వెంకటేశ్ ఓవర్ చేస్తున్నది సినిమాల్లో కాదు.. మరి ఇంకెక్కడా అంటారా.. క్రికెట్‌లో.. అవును.. వెంకటేశ్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి ఇష్టమన్న సంగతి తెలిసిందే.



ఇండియాలో ఎక్కడ టీమిండియా ఆడుతున్నా వెంటనే వాలిపోతుంటాడు. ఐపీఎల్ మ్యాచులనూ వదలడు.. క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం అందులో వింతేముంది అంటారా.. క్రికెట్ చూసేందుకు వెళ్లే వెంకటేశ్ ఊరికే చూస్తూ కూర్చోడు. ఆటను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటాడు.



ప్రత్యేకించి టీ 20 మ్యాచుల్లో.. ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. 120 బంతుల్లో కనీసం 100 బంతులకు లేచి గోల చేస్తాడు వెంకటేశ్. ఈ సంగతి స్వయంగా ఆయనే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మరీ అంత గోల చేయడం తనకు కూడా ఓవర్ అనిపిస్తోందని ఆత్మవిమర్శ కూడా చేసుకుంటున్నాడు.



మరీ అన్నిసార్లు లేవకూడదేమో అని అనుకుంటాడట. కానీ ఆ సమయానికి కంట్రోల్‌ చేసుకోలేకపోతాడట. ఇక టీ20ల్లోని ఆఖరి ఓవర్లయితే మరింత థ్రిల్ ఇస్తాయంటాడు వెంకటేశ్. మరి అంతగా నచ్చినప్పుడు ఎంజాయ్ చేయడంలో తప్పు లేదుగా.. అంతేగా.. అంతేగా..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: