సినిమా రంగంలో వారసత్వం అత్యంత కీలకంగా మారినా కొంతమందికి ఆవారసత్వం కూడ ఎందుకు పనికిరాని విషయంగా మారుతోంది. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ దర్శకులలో ఒకడుగా కొనసాగిన ఈవివి స్యతనారాయణ వారసత్వం అతడి పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ కు ఏమాత్రం కలిసిరాలేదు. తండ్రి ప్రోత్సాహంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆర్యన్ రాజేష్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు.
గత ఆరేళ్లుగా అతడు ఏసినిమాలోను నటించలేదు. అయితే ఇతడు నిర్మాతగా మారి అతడి తమ్ముడు అల్లరి నరేశ్ తో తీసిన 'బందిపోటు' ఘోరమైన పరాజయాన్ని ఇచ్చంది. దీనితో సినిమా నిర్మాణానికి కూడ దూరమైన రాజాశ్ ఈరోజు విడుదలైన ‘వినయ విధేయ రామ’ లో ఒక కీలక పాత్రలో నటించాడు. నటుడుగా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి సహకారంతో ఎదిగిన ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు కనీసం తమని గుర్తించడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
తన తండ్రి బ్రతికి ఉన్న రోజులలో తనను తన తండ్రి ఎంతో సపోర్ట్ చేసాడని అయితే ఆయన చనిపోయిన తరువాత తనకు అవకాశాలు ఇచ్చే వ్యక్తులే కరువయ్యారు అంటూ కామెంట్స్ చేసాడు. ప్రస్తుత పరిస్థుతులలో సినిమాలు నిర్మించడానికి ధైర్యం సరిపోవడంలేదనీ తన తండ్రి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నాడు. అయితే తన తండ్రి వద్ద పనిచేయాకపోయినా దర్శకుడు బోయపాటి తనకు పిలిచి అవకాసం ఇవ్వడంతో ఈమూవీ విజయం పై తాను ఆశలు పెట్టుకున్న విషయాలను వివరించాడు.
అంతేకాదు ఈ ఇండస్ట్రీలో ఎవరు ఎవరికీ హెల్ప్ చేయరనీ అవకాశాలు ఎవరికీ వారే క్రియేట్ చేసుకోవాలి అని అంటున్నాడు. ఈ సంవత్సరం తన తమ్ముడు నరేశ్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ ను అదేవిధంగా మరొక సినిమాను నిర్మించే ఆలోచనలు చేస్తున్నాను అని అంటున్నాడు రాజాశ్. దీనినిబట్టి చూస్తుంటే ఒక నటుడు ఇండస్ట్రీలో సక్సస్ అవ్వాలి అంటే వారసత్వంతో పాటు అదృష్టం కూడ ఎంత అవసరమో అర్ధం అవుతుంది..