బాలీవుడ్ లో ఆ మద్య మహేంద్ర సింగ్ దోనీ జీవిత కథ ఆధారంగా తీసిన ‘దోని’సినిమాలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా స్టార్ హీరో సయిఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్ కూతురు సారా అలీఖాన్ నటిస్తున్న ‘కేథారినాథ్’ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ మద్య ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వి కూడా ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అలాగే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2'తో చుంకీ పాండే కూతురు అనన్య పాండేని లాంచ్ చేస్తున్నాడు.
గతంలో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినా..వారు సీనియర్లు కావడంతో ఇప్పుడు యంగ్ జనరేషన్ కి తగ్గట్టు ఈ బ్యూటీలు పోటీలోకి దిగారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ నటిస్తున్న కేదార్నాథ్ టీజర్ విషయానికి వస్తే..కేథారినాథ్ శివుడి విగ్రహాన్ని భారీ రూపంలో చూపిస్తున్నారు.
ప్రళయం వచ్చి ఊరూ..వాడా మొత్తం కొట్టుకొని పోతుంటే..హీరోయిన్ ని రక్షించేందుకు హీరో ఎన్నో కష్టాలు పడ్డట్టు చూపించారు. ఆర్ఎస్వీపీ మూవీస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఏ విషాదం, ఏ విపత్తు, ఏ దేవుడు కూడా ప్రేమ శక్తిని వేరు చేయలేరని ఆ సినిమాకు క్యాప్షన్ ఇచ్చారు. కేదార్నాథ్ లొకేషన్లలో సినిమాను నిర్మించారు.
2013లో ఉత్తరాదిని, ముఖ్యంగా కేదార్నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు అభిషేక్ కపూర్ దర్శకుడు. అంతే కాదు ఆలయ పరిసరాల్లో భారీగా నీరు చేరటం సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో టీజర్‌ను థ్రిల్లింగ్ గా కట్ చేశారు. ఇక బుట్టలో సారాను ఎత్తుకెళ్లుతున్న సుశాంత్ పోస్టర్ ఫిల్మ్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.