నాగార్జున వయస్సులో మార్పులు పసిగట్టిన వైద్యులు !

Seetha Sailaja
60 సంవత్సరాల వయస్సు దగ్గరలో ఉన్నా నాగార్జున ఇంకా వెండి తెర మన్మధుడు గానే పరిగణింప బడుతున్నాడు. నాగార్జున కూడ తనకు పెద్ద వయస్సు వస్తోంది అంటే అంగీకరించడు. ఇంకా తాను యంగ్ హీరోలతో సమానంగా యంగ్ హీరోయిన్స్ తో రోమాన్స్ చేస్తాను అంటూ ఓపెన్ గానే అంటూ ఉంటాడు నాగ్.

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఈవారం విడుదల కాబోతున్న ‘దేవదాస్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వయసు 30 సంవత్సరాలు మాత్రమే అని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు అంటూ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు. వైద్య శాస్త్ర రీత్యా ఒక వ్యక్తి వయసు ఎంతైనప్పటికీ అతడి శరీర స్థితిని అనుసరించి లెక్క గట్టే వైద్య విధానాన్ని ‘మెటబాలిజం’ అంటారు. 

మన శరీరంలోని ఎముకల శక్తిని అనుసరించి వయస్సు అంచనా వేయడమే ఈ మెటబాలిజం ప్రక్రియ. దీనిప్రకారం తన వయసు 30 ఏళ్ళు అని నాగ్ చెపుతున్నాడు. తాను గత 30 ఏళ్లుగా నిర్విరామంగా వ్యాయామం చేస్తున్నానని మామూలుగా 40 ఏళ్ల వచ్చేసరికి ఏవ్యక్తికైనా మెటబాలిజం రేటు తగ్గుతుందని కానీ తనకు మాత్రం ఈవయసులోనూ అది చాలా ఎక్కువగా ఉందని దాని ప్రకారం తన వయసు 30 ఏళ్లని వైద్యులు నిర్ధరించారని నాగార్జున గర్వంగా చెపుతున్నాడు. 

అంతేకాదు ఇలా గొప్పతనం సాధించడం ఎవరికైనా సాధ్యమే అంటూ వ్యాయాయం మీద ఆధారపడి ఉంటుందని నాగార్జున చెపుతున్నాడు. ‘శివ’ సినిమా చేసే వరకు తాను కూడా అందరిలాగే ఉండేవాడినని కానీ ఆసినిమా కోసం ఫిట్‌ నెస్ ధ్యాస మొదలైందని ఆతర్వాత అది తన దినచర్యలో భాగమైపోయందని అంటూ ప్రతిరోజు ప్రతివ్యక్తి అన్నం తిన్నట్లు మంచి నీళ్లు తాగినట్లే తాను వ్యాయామం ఖచ్చితంగా చేస్తానని అంటూ తాను చేసే వ్యాయామాన్ని ఒక పనిలా కాకుండా ఆనందంగా ఒక తపస్సు లా చేయడం వల్ల శరీర ఆకృతి చాల ఫిట్ గా ఉండటమే కాకుండా యంగ్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటోంది అంటూ తన ఫిట్నెస్ సీక్రెట్ ను బయటపెట్టాడు నాగార్జున..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: