సమంత సలహా పై వెన్నెల కిషోర్ చిందులాట !

Seetha Sailaja
‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ కు విజయ్ దేవరకొండ మ్యానియాతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టచ్ కూడ విపరీతంగా సహకరించింది అని విమర్శకులు కూడ అంగీకరిస్తున్న నిజం. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నఈ కమెడియన్ కోసం దర్శకులు రచయితల చేత ప్రత్యేకమైనకామెడీ ఎపిసోడ్స్ రాయిస్తున్నారు అంటే ఇతడి హవా ఏ రేంజ్ లో కొనసాగుతోందో  అర్ధం అవుతోంది. 

ఇది ఇలా ఉండగా నాగ చైతన్య నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ పై ఇప్పటికే అక్కినేని కాంపౌండ్ ప్రత్యేక శ్రద్ద పెట్టిన విషయం తెలిసిందే. ఈవిషయాలలో భాగంగా సమంత నాగార్జునల సలహా మేరకు ‘శైలజా రెడ్డి’ మూవీలో  ఎనిమిది నిమిషాల పాటు ఉండే ఒక సీన్ ను మారుతీ క్రియేట్ చేనట్లు సమాచారం. ఈసీన్ ఈమూవీ క్లైమాక్స్ ముందు వస్తుందని తెలుస్తోంది.  

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సీన్ అంతా దాదాపు చీకట్లో సాగుతుందని అంటున్నారు. ఈసీన్ చాలా హిలేరయస్ కామెడీతో ఉండటంతో ఈమూవీని చూసే ప్రేకషకులు థియేటర్స్ లో తెగ నవ్వు కుంటారని తెలుస్తోంది. వాస్తవానికి ఈసీన్ ముందుగా స్క్రిప్ట్ లో లేదు. సినిమా షూట్ అంత పూర్తి అయిన తరువాత ఈమూవీని చూసిన నాగార్జున సమంతల చర్చలలో ఈ ఐడియా వచ్చినట్లు టాక్.

ఈ ఐడియావచ్చిన వెంటనే ఈ సీన్ కు సంభందించి స్క్రిప్ట్ ను పూర్తి చేసిన మారుతి వెన్నెల కిషోర్ దగ్గర మూడురోజులు ప్రత్యేకంగా డేట్ లు తీసుకుని ప్రత్యేకంగా షూట్ చేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని పనులు పూర్ర్తి చేసుకుని చివరి దశలో ఉన్న ఈమూవీని ఈ వారంలోనే సెన్సార్ చేయించి ఆఖరి నిమషం సమస్యలు లేకుండా చూసుకోవాలని మారుతి ఆలోచన అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: