టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు బాగా పెరిగిపోయింది. సంవత్సరాని పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ వస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. అయితే కథా కధనం బాగుంటే..చిన్నసినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ జంటగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’సినిమా ఘన విజయం సాధించి పదకొండు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ అందాలే ప్రధాన ఆకర్షణగా నిలవడంతో ఒక్కసారిగా పాయల్ రాజ్ పుత్ హాట్ హీరోయిన్ అయ్యింది. దాంతో అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి . అయితే వస్తున్న అన్ని ఆఫర్ల ని కాదంటోంది పాయల్ రాజ్ పుత్. అందులో రాంచరణ్ కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే..రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పాయల్ తో ఓ ఐటమ్ సాంగ్ లో నటింపజేయాలని చూశారట..కానీ ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించిందట..ఆ తర్వాత అక్కినేని అఖిల్ సినిమాలో కూడా నటించమని కోరితే ఆ సినిమాలో కూడా నటించనని చెప్పిందట ! అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాని సైతం రిజెక్ట్ చేసిందట పాయల్ రాజ్ పుత్ .
దాంతో పాయల్ కి ఒక్క విజయం రావడంతో ఇంత బెట్టు మీద ఉండాల అని కొంత మంది సినీ ఇండస్ట్రీ పెద్దలు విమర్శలు చేస్తున్నారు. ఛాన్స్ ల కోసం చాలామంది హీరోయిన్ లు ఎగబడుతుంటే ఈ భామ మాత్రం వస్తున్న అవకాశాలను తిరస్కరిస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది.