విజయ్ అక్కడ దుమ్ముదులిపేస్తున్నాడు..!

shami
ఒకప్పుడు తెలుగు సినిమాల మర్కెట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండేవి. సూపర్ స్టార్ మహేష్ పుణ్యమాని ఓవర్సీస్ లో మన సినిమాలకు క్రేజ్ వచ్చింది. అక్కడ మహేష్ సినిమా అంటే చాలు 1 మిలియన్ ఈజీ అయ్యింది. మొదట అక్కడ మిలియన్ క్లబ్ లోకి అడుగు పెట్టింది మహేష్ బాబే. 


ఇక మహేష్ చూపిన బాటలోనే స్టార్స్ అంతా ఓవర్సీస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం మొదలు పెట్టారు. టాలీవుడ్ స్టార్స్ కు ఓవర్సీస్ లో ఫాలోయింగ్ ఎక్కువే. సౌత్ లో అందరికన్నా తెలుగు హీరోలకే ఓవర్సీస్ లో క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ క్రమంలోనే యువ హీరోల సినిమాలకు అక్కడ డిమాండ్ పెరిగింది. 


ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ అక్కడ సంచలనం సృష్టించాడు. పెళ్లిచూపులు సినిమానే యూఎస్ లో ఏకంగా 50 రోజులు ఆడగా లేటెస్ట్ గా గీతా గోవిందం కూడా శుక్రవారంతో 1 మిలియన్ క్లబ్ లో చేరినట్టు తెలుస్తుంది. సినిమా ప్రీమియర్స్ తోనే 4 లక్షల డాలర్స్ రాబట్టగా మూడు రోజుల్లోనే మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.


లాంగ్ రన్ లో ఈ సినిమా 2 మిలియన్ క్రాస్ చేసినా చేయొచ్చని అంటున్నారు. పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. విజయ్ సరసన రష్మిక నటించిన ఈ సినిమా విజయ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: