రేణు దేశాయ్ తనకు నచ్చిన వ్యక్తితో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇచ్చిన ప్రకటన షాక్ నుండి ఇంకా పవన్ అభిమానులు తేరుకోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం రాజకీయ సమరంలో అనేక విమర్శలు ఎదుర్కుంటూ ప్రస్తుతం రాబోతున్న ఎన్నికలకు సంబంధించి పోరాటం చేస్తున్న పవన్ కు రేణు దేశాయ్ ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకోవడం ఒక ఊహించని అదృష్టం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దీనికికారణం రాబోతున్న ఎన్నికలు పవన్ ఇమేజ్ కి ఒక పరీక్షగా మారిన నేపధ్యంలో అతడిని అభిమానించి ‘జనసేన’ కు ఎన్ని ఓట్లు పడతాయి ఎన్ని సీట్లు వస్తాయి అని అనేక ప్రముఖ పత్రికలు అంచనాలు ప్రచురిస్తున్నాయి. దీనితో పవన్ కు పడే ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయి అన్న అంచనాలను కూడ పత్రికలు ప్రచురిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ ను వ్యతిరేకించే రాజకీయపార్టీలు నాయకులు పవన్ సిద్ధాంతాలతో పాటు పవన్ వ్యక్తిగత జీవితం పై కూడ విమర్శలు చేసే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది.
పవన్ కు మూడుసార్లు పెళ్ళిళ్ళు జరగడం రేణు దేశాయ్ తో విడాకులు తీసుకోవడం వంటి విషయాలు పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి చాల సులువుగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రేణు దేశాయ్ నుండి పెళ్ళి ప్రకటన రావడం దానికి పవన్ తన అభినందనలు కూడ తెలపడంతో పవన్ ను పెళ్ళిళ్ళ విషయమై వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అని భావిస్తున్న విమర్శకులకు ఒక బ్రహ్మాస్త్రం మిస్ అయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ప్రస్తుతం ఎవరైనా పవన్ ను విమర్శించాలి అంటే అతడి విధానాల గురించి మాట్లాడాలి కానీ పవన్ వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్ల గురించి విమర్శించే అవకాసం లేదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు అంటే విధానాల గురించి మాట్లాటం కంటే ఎదుటి వ్యక్తి అవినీతి అదేవిధంగా ఎదుటి వ్యక్తి జీవితంలోని చీకటి కోణాల గురించి మాట్లాడటం అలవాటుగా మారిన పరిస్థుతులలో ఇప్పుడు రేణు దేశాయ్ పెళ్లి చేసుకోవడం పవన్ రాజకీయాలకు ఇన్ డైరెక్ట్ గా మేలు చేసింది అంటూ కొందరు ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తున్నారు..