‘నా పేరు సూర్య’పై పవన్ ఎఫెక్ట్ పడనుందా?!

siri Madhukar
ఈ మద్య కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనాలు చోటు చేసుకున్నాయి.  నటి శ్రీరెడ్డి మొదలు పెట్టిన కాస్టింగ్ కౌచ్ విషయం చిలికి చిలికి గాలి వాన అయ్యింది.  శ్రీరెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి దారితీశాయి. ఇదిలా ఉంటే..పవన్ కళ్యాన్ ఈ విషయంపై సీరియస్ కావడం ఫిలిమ్ ఛాంబర్ లో కొన్ని మీడియా సంస్థలను నిషేదించాలని..టీడీపీ మంత్రి లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇలా ఎన్నో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో కొన్ని రోజుల వరకు మీడియా వర్సెస్ పవన్ కళ్యాన్ ఎపిసోడ్ నడిచింది. ఏపిలో ఇప్పుడు జనసేన-టీడీపీ ల మద్య కూడా మాటల యుద్దం నడుస్తుంది.

ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' సినిమా మే 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.  ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఏర్పడే అవకాశం ఉందని, స్పెషల్ షోలు ఉండే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది. 

మొన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఓ మీడియాల గొడవ పడ్డ వార్తలు హల్ చల్ చేశాయి.  ఈ మద్య రిలీజ్ అయిన ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' చిత్రాలకు ఏపీలో స్పెషల్ షోల కోసం పర్మిషన్ ఇచ్చారు. ‘రంగస్థలం' చిత్రానికి మార్చి 30 నుండి ఏప్రిల్ 5 వరకు, ‘భరత్ అనే నేను' చిత్రానికి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 వరకు తెల్లవారు ఝామున 5 గంటల నుండి 10 గంటల మధ్య స్పెషల్ షోస్ వేసుకోవడానికి అనుమతి లభించింది.

రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబుకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో మంచి సంబంధాలు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని మరి ఇప్పుడు అధికార పార్టీ ఈ సినిమా  విషయంలో ఎలా స్పందిస్తుందో అని అందరూ టెన్షన్ లో పడ్డారు. పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని ఇష్యూలు, టీడీపీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీకి మద్దతుగా ఉన్నాయంటూ కొన్ని టీవీ ఛానల్స్ మీద పవన్ కామెంట్స్.... పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ఫిల్మ్ చాంబర్ వెల్లడం లాంటి పరిణామాలు ఇందుకు కారణం అనే వాదన వినిపిస్తోంది. కాకపోతే పవన్ ఎఫెక్ట్ కన్నా మెగా అభిమానుల తాకిడి ఎక్కువ ఉండటంతో..ఈ సినిమాకు ప్రభుత్వం నుంచి పరిమిషన్ లభించినందని వార్తలు కూడా వస్తున్నాయి.  అదే జరిగితే..బ్లాక్ టిక్కెట్ల బెడద, శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఎనిమిది రోజులపాటు ఉదయం ప్రత్యేక షో వేయడానికి ప్రభుత్వం  అనుమతించిన వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: