ప్రభాస్ తో సుకుమార్.. లెక్కలు కుదిరితే రికార్డులే..!

shami
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ ప్రస్తుతం రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రాం చరణ్ సరికొత్త ఇమేజ్ ఏర్పరచుకుంటాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.


ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ ఏ సినిమా చేస్తాడన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. అయితే మహేష్, ఎన్.టి.ఆర్, బన్ని, రాం చరణ్ తో సినిమాలు చేసిన సుక్కు ఇప్పుడు ప్రభాస్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది తెలిసిందే.


ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సుకుమార్ కు ఓకే చెప్పే అవకాశం ఉందట. ఈ సినిమాలో బన్ని కూడా నటిస్తాడని టాక్. అల్లు అర్జున్, ప్రభాస్ క్రేజీ మల్టీస్టారర్ కథను సుకుమార్ సిద్ధం చేయబోతున్నాడట.


ఇదే జరిగితే మెగా నందమూరి మల్టీస్టారర్ లానే ఈ సినిమా కూడా క్రేజీగా మారుతుందని చెప్పొచ్చు. రాజమౌళి ఎన్.టి.ఆర్, చరణ్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభాస్, బన్ని సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: